CM KCR Slams : అభివృద్దికి న‌మూనా తెలంగాణ

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్

CM KCR Slams : సీఎం కేసీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మ‌రోసారి ఏపీపై విరుచుకుప‌డ్డారు. డ‌బుల్ రోడ్లు వ‌స్తే తెలంగాణ అని సింగిల్ రోడ్డు వ‌స్తే అది ఏపీ అని ఎద్దేవా చేశారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా బుధ‌వారం జ‌రిగిన స‌భ‌లో కేసీఆర్ ప్ర‌సంగించారు.

CM KCR Slams AP

అభివృద్దికి న‌మూనా తెలంగాణ అని పేర్కొన్నారు. ఆనాడు ఉమ్మ‌డి ఏపీకి సీఎంగా ఉన్న కిర‌ణ్ కుమార్ రెడ్డి తెలంగాణ ఏర్పాటైతే చీక‌టి త‌ప్ప ఏమీ ఉండ‌ద‌న్నార‌ని, కానీ ఇవాళ 24 గంట‌ల పాటు విద్యుత్ వెలుగులతో విరాజిల్లుతోంద‌న్నారు. కానీ త‌మ‌ను గేలి చేసిన ఆ కిర‌ణ్ ఇవాళ క‌నిపించ‌కుండా పోయాడంటూ మండిప‌డ్డారు.

త‌మ‌ను గేలి చేసిన వాళ్లు, విమ‌ర్శ‌లు చేసిన వాళ్లు నామ రూపాలు లేకుండా పోయారంటూ స్ప‌ష్టం చేశారు కేసీఆర్(CM KCR). త‌న‌ను చీద‌రించుకున్న వాళ్లు సైతం చివ‌ర‌కు త‌న‌తో వ‌చ్చి క‌లిశార‌ని ఇది త‌న‌కు ఉన్న ప‌వ‌ర్ అని స్ప‌ష్టం చేశారు .

ఎవ‌రు ఎన్ని జిమ్మిక్కులు చేసినా చివ‌ర‌కు గెలిచేది బీఆర్ఎస్ అని జోష్యం చెప్పారు. త‌మ‌ను గెల‌వ‌కుండా ఎవ‌రూ ఆప లేర‌న్నారు సీఎం. ఇవాళ దేశంలోని ఏ రాష్ట్రంలో లేనంత‌గా అభివృద్ది ఒక్క తెలంగాణ‌లోనే జ‌రిగింద‌న్నారు. ఒక ర‌కంగా చెప్పాలంటే తెలంగాణ అభివృద్దికి న‌మూనాగా మారింద‌ని చెప్పారు కేసీఆర్.

Also Read : Harish Rao : జ‌నం చూపు గులాబీ వైపు

Leave A Reply

Your Email Id will not be published!