CM KCR : కులం..మతంతో రాజకీయం తగదు
తెలంగాణ సీఎం కేసీఆర్ కామెంట్స్
CM KCR : కరీంనగర్ – బీఆర్ఎస్ బాస్, సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఆయన తన దూకుడు ప్రదర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కులం పేరుతో, మతం పేరుతో రాజకీయాలు చేసే బీజేపీని బొంద పెట్టాలని పిలుపునిచ్చారు.
CM KCR Comment
చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని , అభివృద్ది పరంగా ఏం చేస్తారనేది ముందు చెప్పాలన్నారు. ఆయన ప్రధానంగా బీజేపీ మాజీ చీఫ్ బండి సంజయ్ ను టార్గెట్ చేశారు కేసీఆర్(CM KCR). మనుషులను కలపాల్సిన వాళ్లు విభేదాలు సృష్టించడం మంచి పద్దతి కాదన్నారు.
కేంద్రంలో కొలువు తీరిన మోదీ సర్కార్ ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పాలన్నారు. పేదరికం, నిరుద్యోగం, దళితులు, గిరిజనులు , బీసీలు బాధ పడుతున్నారని , వారి కోసం కృషి చేయాలని అన్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు కేసీఆర్.
ఇవాళ మోదీ సర్కార్ దేశానికి చేసింది ఏమీ లేదన్నారు. ఉన్న పరిశ్రమలను బొంద పెట్టడం తప్పితే కొత్తవి తీసుకు వచ్చిన పాపాన పోలేదన్నారు. వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు.
Also Read : Kathi Karthika : కత్తి షాక్ బీఆర్ఎస్ కు జంప్