CM KCR : కాంగ్రెస్ మోసం తెలంగాణ ఆగమాగం

బీఆర్ఎస్ బాస్ , సీఎం కేసీఆర్ ఆగ్ర‌హం

CM KCR : అలంపూర్ – ఇన్నేళ్ల పాల‌న‌లో ఏం మిగిలింద‌ని , కాంగ్రెస్ ఏం చేసిందంటూ నిప్పులు చెరిగారు సీఎం కేసీఆర్. ఆదివారం ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా కొల్లాపూర్, అలంపూర్ ల‌లో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌ల్లో ప్ర‌సంగించారు కేసీఆర్(CM KCR). ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ పార్టీని ఏకి పారేశారు. కానీ విచిత్రం ఏమిటంటే బీజేపీని , ఎంఐఎంను విమ‌ర్శించ‌డం లేదు.

CM KCR Comments on Congress

మ‌రో వైపు కాంగ్రెస్ పార్టీ మాత్రం బీఆర్ఎస్ బీజేపీ, ఎంఐఎం ఒక్క‌టేనంటూ చేసిన ఆరోప‌ణ‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఇదిలా ఉండ‌గా కేసీఆర్ మాట్లాడుతూ 50 ఏళ్ల పాల‌న‌లో కాంగ్రెస్ వ‌ల్ల ఒరిగింది ఏమీ లేద‌న్నారు. వారి నిర్వాకం వ‌ల్ల‌నే 1200 మంది బ‌లిదానం చేసుకున్నార‌ని ఆరోపించారు కేసీఆర్.

దీనికి చిదంబ‌రం క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఆచ‌ర‌ణ‌కు నోచుకోని హామీలు ఇవ్వడం ప‌రిపాటిగా మారింద‌న్నారు. తాము త‌యారు చేసిన పార్టీ మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ కాపీ కొట్టింద‌న్నారు సీఎం కేసీఆర్.

కాంగ్రెస్ పాల‌న‌లో ఆక‌లి బ‌తుకులు, క‌న్నీళ్లు త‌ప్ప ఇంకేం లేవ‌న్నారు. రైతుల పొలాల‌కు నీళ్లు ఇవ్వ‌క తెలంగాణ‌ను ఆగ‌మాగం చేశార‌ని ఆరోపించారు. ఇప్పుడిప్పుడే బాగు ప‌డుతున్నామ‌ని దీనిని కూడా మ‌న‌కు కాకుండా చేసేందుకు మాయ మాట‌లు చెబుతున్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు.

Also Read : Ram Charan Sara Tendulkar : చెర్రీ..సారా కాంబోలో మూవీ

Leave A Reply

Your Email Id will not be published!