CM KCR : కాంగ్రెస్ కు 20 సీట్లు రావు
తెలంగాణ సీఎం కేసీఆర్
CM KCR : ఖమ్మం జిల్లా – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఆయన కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు. ఇన్నేళ్లుగా పాలించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలని నిలదీశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ప్రసంగించిన కేసీఆర్ మల్లు భట్టిని ఏకి పారేశారు. ఆయనకు అంత సీన్ లేదన్నారు.
CM KCR Comments Congress
పొరపాటున గనుక కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇక మీకు మూడినట్టేనని హెచ్చరించారు. కరెంట్ రాదు, నీళ్లు తాగేందుకు ఉండవని , జర ఆలోచించి ఓటు వేయాలని సూచించారు కేసీఆర్(CM KCR). ఇవాళ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత తనదేనని అన్నారు. ఎలాంటి విజన్ అన్నది లేకుండా సొల్లు కబుర్లు చెబితే నమ్మ వద్దని అన్నారు.
కాంగ్రెస్ వాళ్లను సోయి లోనేళ్లంటూ ఎద్దేవా ఏశారు కేసీఆర్. ఎవరికి పరిపాలనా సామర్థ్యం ఉన్నదో గమనించాలని అన్నారు. ఓటు అన్నది వజ్రాయుధమని, దానిని గుర్తు పెట్టుకుని సరైన సమయంలో సరైన వ్యక్తికి ఓటు వేయాలని కోరారు సీఎం.
ఇవాళ 2 లక్షలకు పైగా ఉద్యోగాలను కల్పించిన ఘనత తమ సర్కార్ దేనని చెప్పారు. ప్రతిపక్షాలు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాయని, అవి ఎన్నికలప్పుడే వస్తాయని వారు చెప్పే మాటలకు విలువ ఉండదన్నారు.
Also Read : Kodandaram : ఓటమి భయం పరాజయం ఖాయం