CM KCR : నల్లగొండ జిల్లా – బీఆర్ఎస్ బాస్, సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఆయన కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు. విచిత్రం ఏమిటంటే బీజేపీని, ఎంఐఎంను పల్లెత్తు మాట అనడం లేదు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో విస్తృతంగా పర్యటించారు.
CM KCR Slams Congress
తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పార్టీ కాపీ కొట్టిందని, కాపీ కొట్టి మేనిఫెస్టోలో చేర్చిందంటూ సంచలన ఆరోపణలు చేశారు కేసీఆర్(CM KCR). ప్రధానంగా వ్యక్తిగతంగా అజాత శత్రువుగా పేరు పొందిన మాజీ మంత్రి కందూరు జానా రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం విస్తు పోయేలా చేసింది.
ఇది పక్కన పెడితే ఎంతో అనుభవం కలిగిన జానా రెడ్డి దరఖాస్తు పరిశీలనలో తిరస్కరణకు గురైంది. దీంతో ఆయన బరిలో ఉండడు. అయినా తాను సీఎం అవుతానని కలలు కంటున్నాడని ఎద్దేవా చేశారు. ఆనాడు 24 గంటల పాటు కరెంట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరుతానని అన్నాడని కానీ ఇచ్చిన మాటను నిలబెట్టు కోలేదన్నారు కేసీఆర్.
డబ్బు మదంతో కాంగ్రెస్ సీనియర్ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని కానీ వారికి అంత సీన్ లేదన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో ముందంజలో కొనసాగుతోందన్నారు సీఎం.
Also Read : Revanth Reddy : కేసీఆర్ పాలనకు మూడింది