Bandi Sanjay : కర్ణాటక కాంగ్రెస్ కు కేసీఆర్ సహాయం
బండి సంజయ్ సంచలన ఆరోపణలు
Bandi Sanjay : భారతీయ జనతా పార్టీ తెలంగాణ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay) సంచలన ఆరోపణలు చేశారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ సీఎం కేసీఆర్ పని చేస్తున్నాడని ఆరోపించారు. కర్ణాటక లోని గౌరీబిదనూర్ , బాగేపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలలో బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కర్ణాటక రాష్ట్రానికి నిధులు కేటాయించిందని చెప్పారు బండి సంజయ్ . కాంగ్రెస్ పార్టీకి డబ్బులు అందజేస్తున్నాడంటూ కేసీఆర్(CM KCR) పై నిప్పులు చెరిగారు బీజేపీ చీఫ్. రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఎన్ని వ్యూహాలు పన్నినా బీజేపీ గెలుపును ఆపలేవన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలలో నిజం లేదన్నారు బండి సంజయ్.
ఇదిలా ఉండగా కర్ణాటకలో వచ్చే మే నెల 10న పోలింగ్ జరగనుంది. మే 13న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అధికారంలో ఉన్న బీజేపీకి ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కు మధ్య హోరా హోరీ పోరు నడుస్తోంది. ఇక ఏపీ , తెలంగాణ నుంచి బీజేపీ నేతలు ప్రచారం కోసం బయలుదేరి వెళ్లారు.
Also Read : పేపర్ లీకేజీలో ఐటీ శాఖదే కీలకం – షర్మిల