CM KCR : సాయిచంద్ మరణం తీరని నష్టం – కేసీఆర్
నేను ఆప్తుడిని కోల్పోయానన్న సీఎం
CM KCR : భారత రాష్ట్ర సమితి పార్టీకి, యావత్ తెలంగాణకు తీరని నష్టం సాయిచంద్ అకాల మరణం అని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. గురువారం గుర్రంగూడలోని సాయిచంద్ నివాసానికి చేరుకున్నారు కేసీఆర్. సాయిచంద్ భౌతిక కాయానికి పుష్పాంజలి ఘటించారు. నిన్నటి దాకా తనతో పాటు కలిసి ప్రయాణం చేసిన సింగర్ ను చూసి కన్నీటి పర్యంతం అయ్యారు సీఎం. అనంతరం తండ్రి, భార్య, కుటుంబీకులను, పిల్లలను ఓదార్చారు కేసీఆర్.
ఈ సందర్బంగా సారూ సాయిని పిలవండి లేచి వస్తాడంటూ భార్య రజని విలపించింది. ఆమెను కంట్రోల్ చేయడం ఎవరి తరం కాలేదు. తండ్రిని అక్కున చేర్చుకుని ఓదార్చారు కేసీఆర్(KCR). నేను ఉన్నానంటూ ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు.
అంతకు ముందు ఐటీ, పురపాలిక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సైతం కన్నీటి పర్యంతం అయ్యారు. నిన్నటి నుంచి సాయి చంద్ మృత దేహం వెంటే ఉన్నారు ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ , ప్రజా కవి గోరటి వెంకన్న, పల్లా రాజజేశ్వర్ రెడ్డి, మధుసూదనాచారి, ప్రజా గాయకుడు గద్దర్ నివాళులు అర్పించారు.
Also Read : CM Yogi Adityanath : యూసీసీపై అభ్యంతరం ఎందుకు – సీఎం