MK Stalin Migrant Workers : వలస కార్మికులకు స్టాలిన్ భరోసా
తాను ఉన్నానంటూ అభయ హస్తం
MK Stalin Migrant Workers : తమిళనాడులో ఇటీవల ఫేక్ వీడియోల ప్రచారం కారణంగా సీఎం ఎంకే స్టాలిన్ అప్రమత్తం అయ్యారు. వాటిని పెద్ద ఎత్తున సర్కులేట్ చేస్తున్న వారెవరో తేల్చాలని ఇప్పటికే పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి బీజేపీ స్టేట్ చీఫ్ కె. అన్నామలై పై కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా తమపై ఎలాంటి దాడులు ఇప్పటి వరకు జరగలేదని బీహార్ , పశ్చిమ బెంగాల్ , జార్ఖండ్ నుంచి వచ్చిన వలస కార్మికులు ప్రకటించారు.
మంగళవారం విషయం తెలుసుకున్న సీఎం ఎంకే స్టాలిన్(MK Stalin Migrant Workers) స్వయంగా వారు పని చేస్తున్న వద్దకు వెళ్లారు. భరోసా ఇచ్చారు. తమిళనాడులో గణనీయమైన సంఖ్యలో వలస కార్మికుల జనాభా ఉంది. అనేక మంది నిర్మాణ రంగంతో సహా వివిధ రంగాలలో పెద్ద ఎత్తున పని చేస్తున్నారు. హ్యాండ్స్ గ్లోవ్స్ తయారీలో పాల్గొన్న కనం లాటెక్స్ ను ఇవాళ సందర్శించారు సీఎం. నకిలీ వీడియోల వ్యవహారంపై ప్రత్యక బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు స్టాలిన్.
వలస కార్మికులతో ఆయన ప్రత్యేకంగా సంభాషించారు. వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. తమిళనాడులో ఎంతకాలం ఉంటున్నారు. స్థానిక ప్రజల నుంచి మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగారు. ఈ సందర్బంగా వలస కార్మికులు తమకు మంచి పని వాతావరణం ఉందన్నారు. కొందరు తమిళనాడులో ఐదు సంవత్సరాలకు పైగా ఉంటున్నారని , స్థానికులు తమను సోదర భావంతో చూస్తున్నారని తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు సీఎం(MK Stalin).
Also Read : ఎయిర్ ఫోర్స్ కెప్టెన్ గా షాలిజా ధామి