CM MK Stalin: రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను కేంద్రం కాలరాస్తోంది – స్టాలిన్
రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను కేంద్రం కాలరాస్తోంది - స్టాలిన్
MK Stalin : రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను కేంద్రం హరిస్తోందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విమర్శించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన కేంద్రంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
CM MK Stalin Key Comments
రాష్ట్రాలకు న్యాయంగా దక్కాల్సిన నిధులను కేటాయించడంలో కేంద్రం పక్షపాతం చూపిస్తోందని స్టాలిన్ ఆరోపించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం వాదించి, నిరసనలు తెలిపి, పిటిషన్లు దాఖలు చేయాల్సిన పరిస్థితిలో ఉన్నామన్నారు. ఇది సమాఖ్య వ్యవస్థకు మంచిదికాదన్నారు. ప్రతి రాష్ట్రానికి స్వతంత్ర గుర్తింపు ఉండాలన్నారు. అప్పుడే భారత కీర్తి ప్రపంచస్థాయిలో ప్రకాశిస్తుందన్నారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి నిర్వహించే ‘ఎట్ హోమ్’ కార్యక్రమానికి స్టాలిన్ హాజరు కాకపోవచ్చని తెలుస్తోంది. మరోవైపు గవర్నర్ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం గురించి ప్రస్తావించలేదు. తమిళనాడు ప్రస్తుతం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు. పేదలపై వివక్ష, మాదకద్రవ్యాల వాడకం, మహిళలు, చిన్నారులపై లైంగిక వేధింపులు విపరీతంగా పెరిగిపోయాయన్నారు.
Also Read : PM Narendra Modi: ఎర్రకోటపై ఘనంగా 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
