MK Stalin : వలస కార్మికులకు నేనున్నా – సీఎం
స్పష్టం చేసిన ఎంకే స్టాలిన్
MK Stalin Migrants : వలసదారులపై దాడులు జరుగుతున్నాయని వస్తున్న ప్రచారాన్ని నిశితంగా గమనిస్తున్నామని అన్నారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్(MK Stalin). వారు ఎవరైనా సరే మా సోదరులని, వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని స్పష్టం చేశారు.
బీహార్ కు చెందిన వారిపై కొందరు దాడి చేసినట్లు జరుగుతున్న ప్రచారంపై సీరియస్ గా స్పందించారు ఎంకే స్టాలిన్. ఇది మంచి పద్దతి కాదన్నారు. తాము ఎవరినీ అలా ప్రోత్సహించమని హెచ్చరించారు.
ఎవరైనా అలాంటి దాడులకు గనుక దిగితే కఠిన చర్యలు తప్పవన్నారు సీఎం. ప్రతి ఒక్కరికీ బతికే హక్కు ఉందన్నారు. ఇది కొందరు పనిగట్టుకుని చేస్తున్న ప్రచారంగా తనకు అనిపిస్తోందన్నారు. ఏది ఏమైనా వాస్తవాలు ఏమిటనే దానిపై విచారణ చేపట్టాలని ఆదేశించినట్లు తెలిపారు స్టాలిన్. ఇదిలా ఉండగా వలస దారులపై దాడులకు సంబంధించిన వీడియోలు పూర్తిగా నిరాధారమైనవని తమిళనాడు పోలీసులు ప్రకటించారు.
దీంతో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు సీఎం ఎంకే స్టాలిన్(MK Stalin Migrants). ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులను
కాపాడుకుంటామని స్పష్టం చేశారు. ఎవరైనా మిమ్మల్ని బెదిరిస్తే వెంటనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ కు కాల్ చేయాలని కోరారు ఎంకే స్టాలిన్. తమిళనాడు ప్రజలు ఎవరిపై దాడులకు దిగబోరంటూ తెలిపారు. ఇది ఓ కుట్రగా అనిపిస్తోందని, త్వరలోనే బయటకు వస్తాయని చెప్పారు సీఎం.
తమిళనాడు ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుంది. వారికి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేలా చూస్తామన్నారు సీఎం.
Also Read : జిల్లా కలెక్టర్లు తెలుగులోనే మాట్లాడాలి