CM Nitish Kumar: 2030 నాటికి యువతకు కోటి ఉద్యోగాలు – సీఎం నీతీశ్‌ కుమార్‌

2030 నాటికి యువతకు కోటి ఉద్యోగాలు - సీఎం నీతీశ్‌ కుమార్‌

CM Nitish Kumar : బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ (CM Nitish Kumar) ప్రయత్నాలు మొదలు పెట్టారు. దీనిలో భాగంగా నిరుద్యోగులను ఆకట్టుకునేందుకు ఎక్స్‌ వేదికగా కీలక ప్రకటన చేశారు. 2025-2030 మధ్య కాలంలో కోటి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. గతంలో ఇచ్చిన 50 లక్షల ఉద్యోగాల కల్పన హామీ దాదాపు పూర్తయిందన్నారు.

CM Nitish Kumar Key Comments

2030 కల్లా కోటి ఉద్యోగాల కల్పనకు పారిశ్రామిక రంగంపై ప్రత్యేక దృష్టి సారించి ప్రైవేటురంగంలో విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇందుకు సంబంధించి ఉపాధితా విస్తరణ ప్లానింగ్, అమలు కోసం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి కల్పనా జర్నీలో భాగంగా 2005, 2020 మధ్య 8 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. బీహార్‌ యువతకు ఉద్యోగాల కల్పన, సాధికారత కల్పించానికి తమ ప్రభుత్వం చిరకాలంగా కట్టుబడి ఉందని తెలిపారు.

‘‘ ప్రస్తుత ప్రభుత్వ హయాంలో 10 లక్షల మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాం. ప్రైవేటు రంగంలో మరో 39 లక్షల మందికి ఉపాధి కల్పించాం. గతంలో ఇచ్చిన 50 లక్షల ఉద్యోగాల హామీ దాదాపు నెరవేరినట్లే. ఇప్పుడు లక్ష్యాన్ని రెట్టింపు చేస్తున్నాం. వచ్చే ఐదేళ్లలో కోటి ఉద్యోగాలిస్తాం. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కొత్త ఉద్యోగాలను సృష్టిస్తాం. ప్రధానంగా పారిశ్రామిక రంగాల్లో యువతకు ఉపాధి చూపిస్తాం. దీనికోసం ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేయబోతున్నాం’’ అని నీతీశ్‌ కుమార్‌ పేర్కొన్నారు.

స్కిల్ డవలప్‌మెంట్ యూనివర్శిటీ

స్కిల్ డవలప్‌మెంట్‌కు మరింత ఊతమిచ్చేలా సాత్ నిశ్చయ్ ఇనీషియేటివ్ కింద జననాయక్ కర్పూరి ఠాకూర్ స్కిల్ యూనివర్శిటీని ఏర్పాటు చేయనున్నట్టు నితీష్ కుమార్ (CM Nitish Kumar) ప్రకటించారు. యువతకు స్వయం ఉపాధి అవకాశాలు, ఇండస్ట్రీ రెలివెంట్ శిక్షణకు ఒక వేదికగా ఈ యూనివర్శిటీ ఉంటుందని చెప్పారు.

దీనికి ముందు, 300 అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులను నితీష్ ప్రకటించారు. బిహార్ (Bihar) నుంచి వలస వెళ్లి ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, పంజాబ్, హర్యానా, ఢిల్లీలో ఉంటున్న వారి కోసం, ముఖ్యంగా పండుగ సీజన్లలో వీరి ప్రయాణాలకు వెసులుబాటు కల్పించేలా ఈ అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన బస్సుల్లో 75 ఏసీ, 74 ఏసీ బస్సులు కూడా ఉన్నాయి. ఇందుకోసం జూన్ 24న రూ.105.82 కోట్ల బడ్జెట్‌కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపారు. అదనంగా మరో 150 ఏసీ బస్సులను పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిష్ (పీపీపీ) మోడల్‌లో ప్రవేశపెట్టనున్నామని నితీష్ చెప్పారు. పండుగ సీజన్లలో బిహార్ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వరాష్ట్రానికి చేరుకునేందుకు అదనపు ప్రత్యేక రైళ్లను నడపాలని కేంద్రాన్ని తమ ప్రభుత్వం కోరుతుందని తెలిపారు.

Also Read : Amaravati: అమరావతి భూ కేటాయింపులపై ప్రభుత్వం సంచలన నిర్ణయం

Leave A Reply

Your Email Id will not be published!