CM Nitish Kumar: బిహార్ సీఎం నితీష్ కుమార్ కు బిగ్ షాక్
బిహార్ సీఎం నితీష్ కుమార్ కు బిగ్ షాక్
CM Nitish Kumar : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బిహార్ సీఎం నితీష్ కుమార్(CM Nitish Kumar) కు బిగ్ షాక్ తగిలింది. జేడీ(యు)కి చెందిన ఇద్దరు సీనియర్ నేతలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. వక్ఫ్ బిల్లుకు జేడీ(యు) మద్దతు ఇవ్వడంపై ఆ పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్ నేతలు మహమ్మద్ ఖసిం అన్సారీ, మహమ్మద్ నవాజ్ మాలిక్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జేడీ(యు)కి వారు గురువారం రాజీనామా చేశారు. ఈ మేరకు జేడీ (యు) పార్టీ అధినేత, బిహార్(Bihar) ముఖ్యమంత్రి నితీష్ కుమార్(CM Nitish Kumar)కు వారు లేఖ రాశారు. ఈ బిల్లు రాజ్యాంగ హక్కులను కాలరాస్తుందని మండిపడ్డారు. అంతేకాదు భారతీయ ముస్లింలను అవమానపరిచిందని వారు ఆక్షేపించారు. జేడీ (యు) పార్టీ లౌకిక వాదాన్ని తుంగలోకి తొక్కిందని విమర్శించారు. తన జీవితంలో చాలా సంవత్సరాలు పార్టీలో పని చేసినందుకు తాను నిరుత్సాహపడ్డానని వారు లేఖలో స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఎం నితీష్ కుమార్ వ్యవహారశైలిపై నిప్పులు చెరిగారు.
CM Nitish Kumar Got Shocking
పార్టీ అధినేత లౌకిక భావజాలం కలిగి ఉన్నారని తమలాంటి లక్షలాది మంది భారతీయ ముస్లింలు అచంచల విశ్వాసంతో ఉన్నారని ఇప్పటి వరకు అనుకున్నామని మహమ్మద్ ఖసీం తాను రాసిన లేఖలో స్పష్టం చేశారు. కానీ ఈ నమ్మకం ఈ బిల్లుకు మద్దతు ఇవ్వడంతో తెగిపోయిందన్నారు. అంతేకాదు జేడీ (యు) వైఖరితో ముస్లింలంతా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారని చెప్పారు. ఈ మేరకు ఆయన రాసిన లేఖలో వివరించారు. వక్ఫ్ బిల్లు… భారతీయ ముస్లింలకు వ్యతిరేకంగా ఉందని… దీనికి ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వకూడదన్నారు. ఈ బిల్లు రాజ్యాంగంలోని పలు ప్రాధమిక హక్కులను అతిక్రమిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బిల్లు ద్వారా దేశంలోని ముస్లింలను అవమానపరిచారని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.
పార్టీ అధినేత, సీఎం నితీష్ కుమార్ లౌకిక వాది అని అంతా భావించారని కానీ కాదని నేడు స్పష్టమైందని జేడీయు మైనార్టీ ఫ్రెంట్ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ నవాజ మాలిక్ తన రాజీనామ లేఖ పేర్కొన్నారు. జేడీ (యు) తీసుకున్న నిర్ణయం తామందరిని తీవ్రంగా బాధించిందన్నారు. ఈ బిల్లుకు మద్దతుగా లోక్ సభలో పార్టీ ఎంపీ లాలన్ సింగ్ మాట్లాడిన తీరుతోపాటు ఈ బిల్లుకు మద్దతు ఇచ్చి తీరు మిమ్మల్ని తీవ్రంగా కుంగదీసిందని చెప్పారు.
వక్ఫ్ సవరణ బిల్లును ఏప్రిల్ 2వ తేదీన కేంద్ర మైనారటీ శాఖల మంత్రి కిరణ్ రిజిజు లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ సందర్భంగా లోక్ సభలో కాంగ్రెస్ పార్టీ ఉప నేత గౌరవ్ గోగోయి విరుచుకు పడ్డారు. వారికి సమాధానమిస్తూ… కిరణ్ రిజిజు.. ఈ సవరణ బిల్లు ప్రవేశపెట్టకుంటే… పార్లమెంట్ సైతం వక్ఫ్ ఆస్తి అంటారని పేర్కొన్నారు. దాదాపు 12 గంటల పాటు ఈ సవరణ బిల్లుపై చర్చ జరిగింది. అనంతరం ఈ బిల్లు ఆమోదం పొందింది. అనంతరం ఆమోదం కోసం రాజ్యసభకు ఈ బిల్లు వెళ్లింది. రాజ్యసభలో కూడా ఈ బిల్లు ఆమోదం పొందింది. ఈ నేపథ్యంలో జేడీ యు కు చెందిన ఇద్దరు సీనియర్ నేతలు పార్టీకి రాజీనామా చేశారు.
Also Read : Supreme Court: తమ ఆస్తుల ప్రకటనకు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నిర్ణయం