CM Nitish Kumar : ప్రధానమంత్రి పదవిపై ఆశ లేదు – నితీశ్
ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తీసుకొస్తా
CM Nitish Kumar : బీహార్ సీఎం నితీశ్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మరోసారి ప్రధాన మంత్రి పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ పదవిపై తనకు ఆసక్తి లేదన్నారు.
దానిపై మోజు తీరి పోయిందన్నారు. ఇక భారతీయ జనతా పార్టీతో 17 ఏళ్ల అనుబంధానికి చెక్ పెట్టారు. ఆర్జేడీ, కాంగ్రెస్ , సీపీఐఎంఎల్ , ఇతర పార్టీలతో కలిసి మహా కూటమిని ఏర్పాటు చేశారు.
సీఎంగా నితీశ్ కుమార్(CM Nitish Kumar), డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ కొలువు తీరారు. ఇదిలా ఉండగా శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు సీఎం నితీశ్ కుమార్.
ప్రతిపక్ష పార్టీలను ఏకం కావడానికి తాను ప్రయత్నం చేస్తానని చెప్పారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అందరం ఏకం కావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
2014లో ప్రధాన మంత్రిగా గెలిచిన నరేంద్ర మోదీ రాబోయే 2024 లో గెలుస్తారని ఎలా అనుకుంటాం అని తిరుగు ప్రశ్నించారు. మరి మీరు ప్రధానమంత్రి పదవికి పోటీదారుగా ఉంటారా అన్న ప్రశ్నకు నితీశ్ కుమార్ షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు.
తాను పీఎం రేసులో లేనని మరోసారి స్పష్టం చేశారు సీఎం. ఇప్పటి వరకు పీఎం గురించిన ఆలోచన తనలో లేదన్నారు. ప్రస్తుతం తన ఫోకస్ అంతా బీహార్ రాష్ట్రంపైనే ఉందని చెప్పారు నితీశ్ కుమార్(CM Nitish Kumar).
ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. సామాజిక, ఆర్థికంగా ఎలా రాష్ట్రాన్ని ముందుకు తీసుకు వెళ్లాలనే దానిపై ఫోకస్ పెడుతున్నట్లు స్పష్టం చేశారు సీఎం.
Also Read : శివసేన పార్టీకి 23 వరకు డెడ్ లైన్