CM Nitish Kumar : అశ్లీలతపై బీహార్ సీఎం కన్నెర్ర
ఇది మంచి పద్దతి కాదంటూ ఫైర్
CM Nitish Kumar : బీహార్ – భోజ్ పురి సినిమా రంగానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం నితీశ్ కుమార్. పెద్ద ఎత్తున అశ్లీలత చోటు చేసుకుందంటూ తనకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయని తెలిపారు. దీనిపై తాను కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు కఠిన చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు సీఎం.
CM Nitish Kumar Serious Comments
భోజ్ పురి పేరుతో తీస్తున్న సినిమాలు, పాటల నుండి అశ్లీలతను తొలగించాలని రెండు సంవత్సరాల కింద తాను కూడా అభ్యర్థించానని గుర్తు చేశారు నితీశ్ కుమార్(CM Nitish Kumar). ఆనాటి సర్కార్ కూడా చర్యలు తీసుకున్న పాపాన పోలేదన్నారు. ఇందుకు ప్రధాన కారణం అసెంబ్లీలో మైనార్టీ మహిళలకు కూడా పాత్ర ఉందని ఆరోపించారు సీఎం.
ఇదిలా ఉండగా బీహార్ మొత్తం మహిళలను బహిరంగంగా అవమానించినందుకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తాను తెలుసు కోవాలని అనుకుంటున్నానని స్పష్టం చేశారు. నితీశ్ కుమార్ అసెంబ్లీ సాక్షిగా కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది.
సినిమాలు సమాజాన్ని, ప్రత్యేకించి యువతీ యువకులపై ఎక్కువగా ప్రభావితం చేస్తాయని , బాధ్యతతో వ్యవహరించాల్సిన బాధ్యత దర్శక, నిర్మాతలపై ఉందన్నారు బీహార్ సీఎం. తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Also Read : DK Shivakumar : పునరాలోచనలో ట్రబుల్ షూటర్