TS Universities Jobs : యూనివర్శిటీల్లో పోస్టుల భర్తీకి సీఎం ఓకే
కొత్తగా రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు
TS Universities Jobs : రాష్ట్రంలోని యూనివర్శిటీల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి(TS Universities Jobs) సీఎం కేసీఆర్ పచ్చ జెండా ఊపారు. ఇప్పటికే బాసర త్రిబుల్ ఐటీలో నెలకొన్న తీవ్ర ఆందోళనల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమైంది.
రాహుల్ బొజ్జాను ఇన్ చార్జిగా నియమించినా దానిని కంట్రోల్ చేయలేక పోయారు. జిల్లా యంత్రాంగం కూడా ఘోరంగా వైఫల్యం చెందింది.
ఇదే సమయంలో విద్యా శాఖ మంత్రి విద్యార్థుల సమస్యల్ని సిల్లీవంటూ కామెంట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తమైంది. ఎనిమిది వేల మంది విద్యార్థులు ఏడు రోజుల పాటు ఎండా, వాననక పోరాటం చేశారు.
చివరకు సబితా ఇంద్రారెడ్డి వెళ్లాల్సి వచ్చింది. ఈ తరుణంలో రాష్ట్రంలో యూనివర్శిటీలన్నీ పాలనా పరంగా కునారిల్లి పోయాయి. టీచింగ్ , నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి సీఎం కేసీఆర్ ఓకే చెప్పారు.
ఇందుకు సంబంధించి ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ఇతర నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ(TS Universities Jobs) చేయాలని ఆదేశించారు సీఎం. అంతే కాకుండా ఏ యూనివర్శిటీ స్వంతంగా నియామకం చేపట్టకుండా అన్ని యూనివర్శిటీలకు కలిపి ఒకే బోర్డు ఉండాలని సూచించారు.
ఈ మేరకు కొత్తగా ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ బోర్డును ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. దాని ద్వారానే భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది. ఉమ్మడి నియామక విధానం అవలంభించాలని కేసీఆర్ ఆదేశించారు.
అన్ని యూనివర్శిటీలకు కలిపి 3 వేలకు పైగా ఖాళీలు ఉన్నట్లు గుర్తించారు. అవి ఇంకా పెరిగేందుకు అవకాశం ఉంది. మరో వైపు బాసర త్రిబుల్ ఐటీకి సంబంధించి పూర్తి నివేదికను మంత్రి సీఎంకు సమర్పించారు.
Also Read : విద్యార్థుల పోరాటం దిగొచ్చిన ప్రభుత్వం