CM Pinarayi Vijayan: కేరళ సీఎం విజయన్‌ కుమార్తె వీణపై విచారణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

కేరళ సీఎం విజయన్‌ కుమార్తె వీణపై విచారణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

CM Pinarayi Vijayan : కేరళలో అధికార పక్షం లెఫ్ట్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (ఎల్‌డీఎఫ్‌)కు ఎదురుదెబ్బ తగిలింది. అక్రమ చెల్లింపుల కుంభకోణంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌(CM Pinarayi Vijayan) కుమార్తె టి.వీణను విచారించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. కొచ్చిన్‌ మినరల్స్‌ అండ్‌ రూటైల్‌ లిమిటెడ్‌ (సీఎంఆర్‌ఎల్‌) అక్రమ లావాదేవీల్లో ఆమె ప్రమేయం ఉన్నట్లుగా ఆరోపణలు రావడంతో కంపెనీల చట్టం ఉల్లంఘన కింద అభియోగాలు నమోదయ్యాయి. కార్పొరేట్‌ మోసాలను దర్యాప్తు చేసే భారత ప్రభుత్వ సంస్థ ‘తీవ్ర మోసాల దర్యాప్తు కార్యాలయం’ (సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీస్‌/ఎస్‌ఎఫ్‌ఐవో) కొచ్చిన్‌లోని ప్రత్యేక న్యాయస్థానంలో ఛార్జిషీటు సమర్పించిన నేపథ్యంలో ఈ అనుమతి లభించింది.

CM Pinarayi Vijayan Daughter

అయితే ఇది రాజకీయ ప్రేరేపిత చర్యగా సీపీఎం పొలిట్‌బ్యూరో కోఆర్డినేటరు ప్రకాశ్‌ కారత్, కేరళకు చెందిన సీపీఎం నేతలు శుక్రవారం ఖండించారు. చట్టపరంగా, రాజకీయంగా దీనిని ఎదుర్కొంటామంటూ తమిళనాడులోని మదురైలో జరుగుతున్న సీపీఎం మహాసభల్లో ఈ మేరకు పార్టీ ఓ తీర్మానం కూడా చేసింది. సీఎం విజయన్‌ రాజీనామా చేయాలన్న డిమాండును కాంగ్రెస్, బీజేపీ నాయకులు పునరుద్ఘాటించారు. కొచ్చిన్‌ మినరల్స్‌ అండ్‌ రూటైల్‌ లిమిటెడ్‌ నుంచి టి.వీణ నిర్వహిస్తున్న ఐటీ కంపెనీ ‘ఎక్స్‌లాజిక్‌ సొల్యూషన్స్‌’కు రూ.2.70 కోట్ల చెల్లింపులు జరిగాయి. అయితే దీనికి బదులుగా ఎలాంటి ఐటీ సేవలు అందించలేదన్నది ఆరోపణ. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో ఆమెను విచారించానికి కేంద్రం అనుమతి ఇచ్చింది.

Also Read : YS Sharmila: జగన్ పై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

Leave A Reply

Your Email Id will not be published!