Telangana Governor: తెలంగాణా దశాబ్ది ఉత్సవాలకు గవర్నర్‌ కు ఆహ్వానం ! 

తెలంగాణా దశాబ్ది ఉత్సవాలకు గవర్నర్‌ కు ఆహ్వానం ! 

Telangana Governor: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల వేడుకలకు గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ కు ప్రభుత్వం తరఫున ఆహ్వానం అందింది. శనివారం ఉదయం రాజ్‌భవన్‌ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy), ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలంగాణా దశాబ్ది ఉత్సవాల ఆహ్వానాన్ని గవర్నర్‌ రాధాకృష్ణన్ కు అందించారు. జూన్‌ 2న సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌ లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను కాంగ్రెస్‌ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్వహించాలని నిర్ణయించింది. రాజకీయ పార్టీలకు, పలువురు నేతలకు హాజరు కావాలని ఆహ్వానం పంపింది. ఈ సందర్భంగా పలు అధికారిక కార్యక్రమాలు జరగనున్నాయి.

మరోవైపు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ పరిసరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. జూన్‌ 2న ఉదయం పరేడ్‌ మైదానంలో జాతీయ జెండా ఆవిష్కరణ, ఇతర కార్యక్రమాలు ఉంటాయి. సాయంత్రం ట్యాంక్‌ బండ్‌పై ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన కళాబృందాలతో ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. అ దశాబ్ది ఉత్సవాలకు సంబంధించి ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఆహ్వానం అందించినప్పటికీ… తాను హాజరు కాలేనంటూ బహిరంగ ప్రకటన విడుదల చేసారు. సుమారు 22 పేజీల సుధీర్ఘ బహిరంగ లేఖను ఆయన విడుదల చేసారు

Telangana Governor – సోనియా రాక అనుమానమే !

తెలంగాణా దశాబ్ది ఉత్సవాలకు ముఖ్య అతిథిగా కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు సోనియా గాంధీని ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఢిల్లీ వెళ్లి మరీ సీఎం రేవంత్‌రెడ్డి సోనియాకు ఆహ్వానం అందించారు. ఈ నేపథ్యంలో వేడుకల కార్యక్రమాల్లో మినిట్ టూ మినిట్ ప్రోగ్రామ్ లో ఆమె స్పీచ్ కు టైం కేటాయించడంతో దాదాపు ఆమె రావడం ఖాయం అని అందరూ అనుకున్నారు. అయితే అనారోగ్యం… పైగా ఎండలు తీవ్రంగా ఉండడంతో ఈ పర్యటన రద్దయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ పర్యటకు రాలేకపోతున్నట్లు ఇప్పటికే ఢిల్లీ వర్గాలు… రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.

Also Read : Prajwal Revanna: పరారీలో ప్రజ్వల్ రేవణ్ణ తల్లి ! కారణం అదేనా ?

Leave A Reply

Your Email Id will not be published!