CM Revanth Reddy: బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధమా అంటూ సీఎం రేవంత్‌రెడ్డి సవాల్ !
బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధమా అంటూ సీఎం రేవంత్‌రెడ్డి సవాల్ !
CM Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. గత, ప్రస్తుత ప్రభుత్వాల హయాలంలో జరిగిన అవినీతిపై శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు మధ్య మాటల యుద్ధం నడిచింది. హరీష్‌రావు వ్యాఖ్యలపై సీఎం రేవంత్ గట్టి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాలని… ప్రభుత్వం ప్రజల లక్ష్యంగా పని చేయాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఆరు గ్యారంటీలకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌లో కేటాయింపులు పెంచారు… కానీ అసలు బడ్జెట్‌లో కేటాయింపులు తగ్గించారని విమర్శించారు. కాంగ్రెస్ అంటేనే ధోకా పార్టీగా మారిపోయిందని హరీష్ విమర్శలు గుప్పించారు.
ఈ వ్యాఖ్యలపై సీఎం రేవంత్(CM Revanth Reddy) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అబద్ధాలతో హరీష్ రావు ఊకదంపుడు ఉపన్యాసం ఇస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను మభ్య పెట్టాలని చూస్తే వారు నమ్మడానికి సిద్ధంగా లేరన్నారు. ప్రజలు శిక్షించినా వాళ్ల ఆలోచన మారలేదని… అదే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారన్నారు. లక్షల కోట్ల విలువైన ఔటర్ రింగ్ రోడ్డును రూ.7వేల కోట్లకే తెగనమ్మారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ పథకంలో రూ.700 కోట్ల అవినీతి జరిగిందని సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ఆరోపించారు. గొర్రెల స్కీం పేరుతో బీఆర్ఎస్ నాయకులు కోట్ల రూపాయలు దండుకున్నారని… గొప్ప పథకం అని చెప్పిన బతుకమ్మ చీరల్లోనూ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఆడబిడ్డల సెంటిమెంట్ నూ దోపిడీకి ఉపయోగించుకున్నారన్నారు. బతుకమ్మ చీరలు అని చెప్పి సూరత్ నుంచి కిలోల లెక్క తీసుకువచ్చి పంపిణీ చేశారు. బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధంగా ఉన్నారా’’ అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.
CM Revanth Reddy – హరీష్ రావుకు రేవంత్ సవాల్ !
‘‘బీఆర్ఎస్ ఎన్ని వేల కోట్ల విలువైన భూములు అమ్మిర్రో లెక్క తీద్దాం..అప్పుల లెక్కలు చెబుతున్నారు… కానీ అమ్ముకున్న లెక్కలు చెప్పడంలేదు.. పదేళ్లయినా పాలమూరుకు చేసిందేం లేదు. 20లక్షల కోట్లకు పైగా ఖర్చుపెట్టినా పాలమూరు ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి కారణం వీళ్లు కాదా? రంగారెడ్డి జిల్లాను ఎడారిగా మార్చారు. గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నా. రంగారెడ్డి జిల్లాపై నిర్లక్ష్యం వహించారు. రంగారెడ్డి జిల్లా ఆస్తులు అమ్ముకున్నారు కానీ జిల్లాకు సాగు నీరు ఇవ్వలేదు. ప్రజలు బీఆర్‌ఎస్‌కు గుండుసున్నా ఇచ్చినా బుద్ధి మారకుండా ఇలా మాట్లాడటం సరైంది కాదు. మీరు నిజాయితీ పాలన అందించి ఉంటే… బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్స్, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధంగా ఉన్నారో లేదో చెప్పాలి’’ అంటూ సీఎం సవాల్ విసిరారు.
Also Read : Sharad Pawar: హెం మంత్రి అమిత్ షా పై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు !