CM Revanth Reddy : బాధిత కుటుంబానికి సీఎం భరోసా
స్విగ్గీ డెలివరీ బాయ్ ఫ్యామిలీకి రూ. 2 లక్షల చెక్
CM Revanth Reddy : హైదరాబాద్ – తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) కీలక నిర్ణయం తీసుకున్నారు. నాలుగు నెలల కిందట విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మృతి చెందాడు స్విగ్గీ డెలివరీ బాయ్. ఇచ్చిన మాట ప్రకారం రూ. 2 లక్షల ఆర్థిక సాయం అందించారు.
శనివారం బాధిత కుటుంబాన్ని తన వద్దకు పిలిపించారు. కేవలం ఘటన జరిగిన వారం రోజుల్లోనే సీఎం ఆర్థిక భరోసా ఇచ్చారు. సీఎం సహాయ నిధి నుండి చెక్కును సచివాలయంలో బాధిత కుటుంబానికి అందజేశారు రేవంత్ రెడ్డి.
CM Revanth Reddy Comment
ఇదిలా ఉండగా ఈనెల 23న గిగ్ వర్కర్స్ తో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో సమావేశం జరిగింది. ఈ మీటింగ్ లో నాలుగు నెలల కిందట ఫుడ్ డెలివరీ కోసం వెళ్లి ప్రమాద వశాత్తు మృతి చెందాడు స్విగ్గీ బాయ్. ఈ విషయం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించరాఉ సీఎం.
గత సర్కార్ ఆ కుటుంబానికి ఏదైనా సాయం చేస్తుందని ఆశించానని, కానీ మాజీ సీఎం, ప్రభుత్వం స్పందించ లేదని వాపోయారు. ఆ కుటుంబ వివరాలు తెలుసుకుని సీఎం సహాయ నిధి నుంచి వెంటనే రూ. 2 లక్షలు ఇవ్వాలని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్బంగా బాధిత కుటుంబం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపింది.
Also Read : Nalini Ex DSP : సీఎంను కలిసిన మాజీ డీఎస్పీ