CM Revanth Reddy : రేవంత్ ఢిల్లీ టూర్ పై ఉత్కంఠ
మంత్రి..నామినేటెడ్ పదవులపై ఫోకస్
CM Revanth Reddy : హైదరాబాద్ – సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 21న ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధానంగా ఇంకా కేబినెట్ లో కూర్పుపై మరోసారి పార్టీ హైకమాండ్ లో చర్చించనున్నట్లు సమాచారం. అంతే కాకుండా త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో 17 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఒక రకంగా కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వానికి అగ్ని పరీక్షగా మారనుంది.
CM Revanth Reddy Delhi Tour Vial
కేవలం 2 శాతం తేడాతో ఓటమి పాలైంది బీఆర్ఎస్. మరో వైపు భారతీయ జనతా పార్టీ చాలా మేరకు పుంజుకుంది. ఆ పార్టీకి 8 సీట్లు దక్కాయి. దీంతో ఎలాగైనా సరే ఈసారి కనీసం 10 సీట్లు అయినా గెలుచు కోవాలని కమల దళం భావిస్తోంది.
ఇదిలా ఉండగా ఉన్నట్టుండి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఢిల్లీకి బయలు దేరడంతో పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు, ఆశావహుల్లో మరింత ఆసక్తి రపుతోంది. కేబినెట్ లో ఇంకా 6 మందిని తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు టఫ్ ఫైట్ ఇచ్చిన నేతలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉందని ఆలోచిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి.
తొలి కేబినెట్ లో ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కలేదు. ఇక మంత్రివర్గం రేసులో షబ్బీర్ అలీ, ఫిరోజ్ ఖాన్ తో పాటు మహమ్మద్ అజహరుద్దీన్ ను కూడా పరిగణలోకి తీసుకోనున్నట్లు టాక్. మరో వైపు 54 కార్పొరేషన్లు, పలు నామినేటెడ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తంగా కేబినెట్ విస్తరించే పనికి శ్రీకారం చుడతారా లేక ఉట్టి చేతులతో తిరిగి వస్తారా అన్నది వేచి చూడాలి.
Also Read : Harish Rao : రైతు బిడ్డకు హరీశ్ రావు కంగ్రాట్స్