CM Revanth Reddy: పరువు నష్టం దావా కేసులో హైకోర్టును ఆశ్రయించిన సీఎం రేవంత్ రెడ్డి
పరువు నష్టం దావా కేసులో హైకోర్టును ఆశ్రయించిన సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు పరువు నష్టం దావా కేసులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తనపై నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో ఉన్న పరువు నష్టం దావా కేసు కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ లో కోరారు. గతేడాది ఎన్నికల ప్రచారంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెంలో కాంగ్రెస్ నిర్వహించిన సభలో రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగంపై బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు పరువు నష్టం దావా వేశారు. బీజేపీకు పరువు నష్టం కలిగేలా రేవంత్ రెడ్డి మాట్లాడారంటూ ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన ఆడియో, వీడియోలను కోర్టుకు సమర్పించడంతో… కాసం పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ప్రజాప్రతినిధుల కోర్టు… విచారణలో భాగంగా సాక్షుల వాంగ్మూలం నమోదు చేసింది.
CM Revanth Reddy Approach High Court
బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఎన్నికల సమయంలో చెప్పారని కాసం తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై ప్రజాప్రతినిధుల కోర్టు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రసంగం ఆడియో, వీడియో క్లిప్పింగ్ లను సైతం కాసం కోర్టుకు సమర్పించారు. దీనితో విచారణలో ఉన్న ఈ కేసును కొట్టేయాలని సీఎం రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. కేసు విచారణ చేపట్టకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన తన పిటీషన్ లో కోరారు. అలాగే, కోర్టు హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనితో సీఎం రేవంత్ రెడ్డి పిటీషన్ ను స్వీకరించిన హైకోర్టు ఈ కేసుపై గురువారం విచారణ జరిగే అవకాశం ఉంది.
Also Read : KTR: బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లను పరిశీలించిన కేటీఆర్