CM Revanth Reddy: రాహుల్ తో కలిసి ‘ఓటర్ అధికార్’ యాత్రలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి
రాహుల్‌తో కలిసి ‘ఓటర్ అధికార్’ యాత్రలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి
CM Revanth Reddy : ఓటర్ల జాబితాలో లోపాలను ఎత్తిచూపుతూ బిహార్ లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘ఓటర్ అధికార్ యాత్ర’లో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) పాల్గొన్నారు. సుపౌల్ లో నిర్వహించిన పాదయాత్రకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో కలిసి ఆయన హాజరయ్యారు. సీఎం రేవంత్‌తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, డీసీసీ అధ్యక్షుడు రోహిన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
CM Revanth Reddy – ఈ నెల 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆగస్టు 30వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అంతకు ముందు రోజు అంటే 29వ తేదీన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. ఈ కేబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం కమీషన్ నివేదికపై చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశాల్లోనే సభ్యులందరికీ కమిషన్ రిపోర్ట్‌ను ప్రభుత్వం అందించనుంది. కాగా, అసెంబ్లీ సమావేశాలు 5 రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
CM Revanth Reddy – నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపేయండి – ఎన్‌జీటీ
జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్‌జీటీ)లో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపేయాలని ఎన్‌జీటీ ఆదేశించింది. పర్యావరణ అనుమతులు లేకుండా పనులు చేయొద్దని ఎన్‌జీటీ తన తాజా ఆదేశాల్లో స్సష్టం చేసింది.
ఇప్పటికే ప్రాజెక్టుకు సంబంధించి భూ సర్వేలు పూర్తయ్యాయి, ప్యాకేజీ-1, ప్యాకేజీ-2లుగా విభజించి పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అధికారులకు పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఈ నేపథ్యంలో దానికి పర్యావరణ అనుమతులు లేవన్న ఎన్‌జీటీ… ఆ ప్రాజెక్ట్ పనులను నిలిపివేయాలని స్పష్టం చేసింది. ఈ పరిణామం నేపథ్యంలో, ప్రాజెక్టు భవితవ్యం పర్యావరణ అనుమతులపై ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వానికి ఇప్పుడు ఎన్‌జీటీ ఆదేశాలను పాటిస్తూ, అవసరమైన అనుమతులు పొందే దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
Also Read : CDS Anil Chauhan: భవిష్యత్తులో యుద్ధాలకు ఆ నాలుగే కారణాలు – సీడీఎస్ చీఫ్ అనిల్ చౌహాన్
