CM Revanth Reddy: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం రేవంత్ భేటీ
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం రేవంత్ భేటీ
CM Revanth Reddy : కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు. భారీ వర్షాల కారణంగా తెలంగాణ రాష్ట్రానికి సంభవించిన నష్టంపై ఆర్థిక మంత్రికి నిర్మలా సీతారామన్‌కు (Nirmala Sitharaman) నివేదిక అందజేశారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు ఆర్థిక సహాయం అందించాలని నిర్మలా సీతారామన్‌కు సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు.
CM Revanth Reddy Meet
ఇక సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనలో భాగంగా పార్లమెంట్‌లో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఓం బిర్లాతో సమావేశమైన వారిలో సీఎం రేవంత్‌తో (CM Revanth Reddy) పాటు ఎంపీలు డాక్టర్ మల్లు రవి, సురేశ్ షెట్కార్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రామసహాయం రఘురాంరెడ్డి, కె.రఘువీర్ రెడ్డి, డాక్టర్ కడియం కావ్య, పోరిక బలరాం నాయక్‌లు ఉన్నారు.
నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్‌రెడ్డి కీలక భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించారు. ఈ క్రమంలో జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో రేవంత్‌రెడ్డి సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. రీజినల్ రింగు రోడ్డుకు (నార్త్ పార్ట్) సంబంధించి 90 శాతం భూ సేకరణ పూర్తయినందున పనుల ప్రారంభానికి కేంద్ర ఆర్థిక, కేబినెట్ అనుమతులు ఇప్పించాలని విన్నవించారు సీఎం రేవంత్‌రెడ్డి. జాతీయ రహదారులు, రోడ్డు రవాణా శాఖ (MORTH) నిబంధనలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన డీపీఆర్‌కు అనగుణంగా రీజినల్ రింగు రోడ్డు (సౌత్ పార్ట్)కు అనుమతులు ఇప్పించాలని కేంద్ర మంత్రిని కోరారు సీఎం రేవంత్‌రెడ్డి. రావిర్యాల – ఆమన్‌గల్ – మన్ననూర్ రహదారిని నాలుగు వరుసల గ్రీన్‌ఫీల్డ్ రహదారిగా నిర్మించాలని సూచించారు.
అలాగే, మన్ననూర్ – శ్రీశైలం (ఎన్‌హెచ్ 765) నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడార్‌కు అనుమతించాలని కేంద్ర మంత్రి గడ్కరీని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్ – మంచిర్యాల మధ్య నూతన గ్రీన్‌ఫీల్డ్ రహదారిని జాతీయ రహదారిగా మంజూరు చేయాలని విన్నవించారు. హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్టు వరకు 12 వరుసల గ్రీన్ ఫీల్డ్ రహదారికి అనుమతి ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరారు సీఎం రేవంత్‌రెడ్డి.
Also Read : Digital Arrest Scam: ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో మాజీ ఎమ్మెల్యేకు 31 లక్షలు టోకరా
