CM Revanth Reddy: రిజర్వేషన్లు 50 శాతం మించకుండా కేసీఆర్ చట్టం తెచ్చారు – సీఎం రేవంత్

రిజర్వేషన్లు 50 శాతం మించకుండా కేసీఆర్ చట్టం తెచ్చారు - సీఎం రేవంత్

CM Revanth Reddy : స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం మించకుండా కేసీఆర్ చట్టం తెచ్చారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ అడ్డంకిని తొలగించడానికి ఆర్డినెన్స్ తెచ్చామని పీఏసీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వెల్లడించారు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీనియర్‌ నేతలు వీహెచ్‌, జానారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ తెచ్చిన చట్టాన్ని సవరించడానికి ఆర్డినెన్సు తెచ్చామని.. దాన్ని గవర్నర్ కేంద్రానికి పంపారని తెలిపారు. ఎట్టిపరిస్థితుల్లో బీసీలకు మేలు జరగాల్సిందేనని సీఎం అన్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట నిలబడాలన్న సీఎం రేవంత్.. కేసీఆర్ తెచ్చిన చట్టం ప్రకారం బీసీలకు ఒక్క శాతం రిజర్వేషన్ కూడా రాదన్నారు.

CM Revanth Reddy Slams KCR

90 రోజులలో రాష్ట్రపతి బిల్లులను ఆమోదించాలన్న అంశంపైన సుప్రీం కోర్టులో మన రాష్ట్ర వాదనలు వినిపించడం కోసం ఇద్దరు న్యాయవాదులను నియమించామని సీఎం చెప్పారు. అందులోనే రాష్ట్రపతి దగ్గర ఉన్న మన బీసీ బిల్లు అంశం ప్రస్తావనకు వస్తుందని చెప్పారు. విడిగా సుప్రీం కోర్టుకు వెళ్తే కేసు లిస్ట్ కావడానికి చాల సమయం పడుతుందని స్పష్టం చేశారు.

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కాంగ్రెస్‌ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించిన నేతలు.. పార్టీపరంగా బీసీలకు 42 శాతం టికెట్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఇవాళ సాయంత్రం గాంధీభవన్‌లో నిర్వహించిన కాంగ్రెస్‌ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పలు అంశాలపై నేతలు చర్చించారు. రాష్ట్రస్థాయిలో పెండింగ్‌లో ఉన్న కమిటీల నిర్మాణంపై చర్చించారు. ఏఐసీసీ పిలుపు మేరకు ఓట్‌ చోరీ, గద్దీ ఛోడ్‌ ఉద్యమం చేపట్టాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన లోగోను ఆవిష్కరించారు.

Also Read : India: అమెరికాకు పోస్టల్ సర్వీసులు నిలిపివేసిన భారత్

Leave A Reply

Your Email Id will not be published!