CM Revanth Reddy: కులగణనపై సీఎం రేవంత్ రెడ్డి ఆశక్తికరమైన వ్యాఖ్యలు
కులగణనపై సీఎం రేవంత్ రెడ్డి ఆశక్తికరమైన వ్యాఖ్యలు
CM Revanth Reddy : రాష్ట్రంలో జరిగిన కులగణన కేవలం డేటా సేకరణ కాదని… ఇది తెలంగాణ మెగా హెల్త్ చెకప్‌గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివర్ణించారు. రాష్ట్రంలో బీసీల అభ్యున్నతికి, సామాజిక న్యాయం అమలు చేసేందుకు కులగణన ఉపయోగపడుతుందన్నారు. కులగణనపై సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి నేతృత్వంలోని నిపుణుల కమిటీ ఎంసీహెచ్‌ఆర్‌డీలో సీఎం రేవంత్‌రెడ్డితో (CM Revanth Reddy) సమావేశమైంది. 300 పేజీల నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. కులాల వారీగా వెనుకబాటుతనాన్ని విశ్లేషించిన కమిటీ… కొత్త పాలసీలతో పాటు ప్రస్తుత విధానాలను మెరుగుపరిచేందుకు అవసరమైన సూచనలను నివేదికలో పొందుపర్చింది. కమిటీ సూచనలపై కేబినెట్ లో చర్చించి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోనుంది.
వెనుకబాటుతనంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య తేడాలు, వాటికి కారణాలను కూడా అధ్యయనం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) సూచించారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో నిర్వహించిన సర్వే చరిత్రాత్మకమైందని.. దేశానికి రోల్ మోడల్‌గా మారుతుందని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, సీతక్క, అధికారులు పాల్గొన్నారు.
CM Revanth Reddy – సీఎం రేవంత్ రెడ్డిని తిడితే నా రక్తం ఉడుకుతోంది – జగ్గారెడ్డి
సీఎం రేవంత్ రెడ్డిని (CM Revanth Reddy) తిడితే తన రక్తం ఉడుకుతోందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పష్టం చేసారు. గాంధీ భవన్లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో జగ్గారెడ్డి బీఆర్ఎస్ పైనా, కేటీఆర్ మీదా హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పాలనపై సిద్దిపేట, సిరిసిల్లా, గజ్వేల్ లో మీటింగ్ పెట్టేందుకు సిద్ధమాని జగ్గన్న… కేటీఆర్ ను సవాల్ చేశారు. చర్చకు మీ ఫ్యామిలీ రెడీ అయితే, మా కాంగ్రెస్ ఫ్యామిలీ రెడీ అంటూ ఛాలెంజ్ చేశారు. మీటింగ్ ఖర్చు రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) భరిస్తారని చెప్పారు. ‘సీఎం రేవంత్ రెడ్డిని నేను ఒప్పిస్తాను. బీఆర్ఎస్ నేతలు చర్చకు వస్తారా? ఏ శాఖపై చర్చ చేద్దామో చెప్తే ఆ మంత్రిని చర్చకు ఒప్పిస్తాను. ఎమ్మెల్యే అయ్యాక కూడా నేను దొడ్డు బియ్యమే తిన్నాను. కేసీఆర్ పాలన ‘ఆహా నా పెళ్ళంట’ సినిమాలో కోట శ్రీనివాస్ తిన్న కోడి లాగా ఉండేది. చదువు అంటే భవిష్యత్తు కాబట్టే మా ప్రభుత్వం పిల్లల చదువుపై ఖర్చు చేస్తున్నాం. కేటీఆర్ ను చూస్తే జాలిగా ఉంది.’ అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.
మహిళలను మీటింగుకు పిలిచి ఉచిత బస్సు వల్ల ఉపయోగముందా లేదా అని అడుగుదామని జగ్గారెడ్డి కేటీఆర్ ని సవాల్ చేశారు. బీఆర్ఎస్ (BRS) నాయకులను శరీరమంతా భూమిలో పాతి పెట్టి పాములు వదిలే పనిష్మెంట్ ఇవ్వాలని జగ్గారెడ్డి అన్నారు. ‘ఏం తప్పు చేశామని సీఎం రేవంత్ ను, కాంగ్రెస్ పార్టీని తిడుతున్నారు? ఉచిత బస్సు వల్ల మహిళలకు ఉపయోగం జరిగిందా లేదా అని సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ నియోజకవర్గంలో అడుగుదామా? తెలంగాణ ప్రజలు రాహుల్ నాయకత్వంపై, కాంగ్రెస్ పార్టీపై విశ్వాసంతో మాకు అధికారం ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు అవుతోంది. పదేండ్లలో కేసీఆర్ ప్రభుత్వాన్ని తిట్టడానికి అనేక కారణాలున్నాయి. లక్ష రూపాయల రుణమాఫీ చేయడానికి కేసీఆర్ ఐదేండ్లు చేసారు.
ముస్లింలకు, ఎస్టీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మోసం చేసారు. పేదలకు ఇండ్లు ఇస్తామని పిట్ట కథలు చెప్పి ఇవ్వలేదు. మల్లన్న సాగర్ రైతుల వీపులు పగలకొట్టారు. పదేండ్లు భయంకర, దుర్మార్గ, నికృష్ట పాలన కొనసాగింది. గొంతు విప్పితే గొంతు నొక్కే నీచమైన పరిపాలన కేసీఆర్ చేసారు. దుర్మార్గపు పాలన చేసారు కాబట్టే ప్రజలు, కాంగ్రెస్ నేతలు కేసీఆర్ ప్రభుత్వాన్ని తిట్టారు. నలుగురు మంత్రులను ఒప్పిస్తాను సిరిసిల్లాలో మహిళలతో మీటింగ్ పెట్టుకుందాం కేటీఆర్ సిద్ధమా? ఒకటో తారీఖున జీతాలు, పెన్షన్లు ఇస్తున్నాం. 23 వేల కోట్ల రూపాయల మేర రుణమాఫీ చేశాం. ప్రతి క్వింటాల్ కి 500 రూపాయల బోనస్ ఇచ్చాం.’ అని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.
కేటీఆర్ సంగతేందో చూద్దాం జగ్గన్న అని రేవంత్ అంటే నేను టెంప్ట్ కాకుండా ఉండగలనా? అని చెప్పిన జగ్గారెడ్డి.. ‘నేను, రేవంత్ అటాకింగ్ లనే అటాకింగ్ చేసి వచ్చిన వాళ్ళం. అనవసరంగా రేవంత్ ను రెచ్చగొట్టకు. రేవంత్ (CM Revanth Reddy) మూడ్ పాడైతే కేటీఆర్ ఇంట్లో నుండి బయటకి రాలేడు. తోపులంతా మా దగ్గర ఉన్నారు. మగాడివైతే రా అని కేటీఆర్ అన్నాడు.. ఆ డైలాగ్ కేటీఆర్ కి సెట్ కాదు. సీరియస్ డైలాగ్స్ కేటీఆర్ కి సెట్ కావు. కేటీఆర్ వాడింది మా డైలాగ్. రేవంత్ రెడ్డిని మగాడివైతే రా అని అనగలరా?
రేవంత్ సీరియస్ గా తీసుకొని వస్తే కేటీఆర్ గుండెకు నిద్ర పడుతదా? కేటీఆర్ సంగతేందో చూద్దామని రేవంత్ సెక్యూరిటీని పక్కన పెడితే కేటీఆర్ పరిస్థితి ఏంటి? రేవంత్ వస్తే తట్టుకునే గట్స్ కేటీఆర్ కి ఉన్నాయా? మేం అపోజిషన్లో ఉన్నప్పుడే పోలీసులను అదరగొట్టాం. రేవంత్ ను అరెస్ట్ చేసేందుకు నీ చెంచాలను రేవంత్ బెడ్ రూం లోకి పంపినప్పుడు.. తెలంగాణ ఉద్యమంలో సంగారెడ్డికి వస్తే అడ్డుకుంటానని కేసీఆర్ కు సవాలు చేశా. 12 గంటల పాటు కేసీఆర్ నా బార్డర్ దాటలేకపోయారు.’ అని జగ్గారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.
Also Read : Priyanka Chaturvedi: బీసీసీఐపై శివసేన యూబీటీ ఎంపీ ప్రియాంక చతుర్వేది ఆగ్రహాం
