CM Revanth Reddy: నల్గొండ ప్రజల కోసమే మూసీ ప్రక్షాళన – సీఎం రేవంత్‌రెడ్డి
నల్గొండ ప్రజల కోసమే మూసీ ప్రక్షాళన - సీఎం రేవంత్‌రెడ్డి
CM Revanth Reddy : హైదరాబాద్ నగర ప్రజల దాహార్తిని తీర్చడానికే గోదావరి తాగునీటి పథకం తీసుకొచ్చినట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. వరద నియంత్రణ కోసమే ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జంట జలాశయాలను నిర్మించారని అన్నారు. తాగునీటి సమస్యలు పరిష్కరించడానికే పీజేఆర్ పోరాటాలు చేశారని గుర్తు చేశారు. మూసీ పునరుజ్జీవంలో భాగంగా… ఉస్మాన్‌సాగర్ వద్ద చేపట్టిన గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్ 2, 3 ప్రాజెక్టు పనులకు సీఎం శంకుస్థాపన చేశారు.
CM Revanth Reddy Key Comments on Musi River
రూ.7,360 కోట్లతో హ్యామ్ విధానంలో ఈ పనులు చేపట్టనున్నారు. రెండేళ్లలో గోదావరి ఫేజ్ 2, 3 పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) మాట్లాడుతూ… నల్గొండ జిల్లాలో పాదయాత్ర చేసినప్పుడు మూసీ నదిని ప్రక్షాళన చేయాలని ప్రజలు చెప్పారని అన్నారు. సమస్యలు సృష్టించినా సమన్వయంతో ముందుకెళ్తున్నామన్నారు. తాగునీరు అందించేందుకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ‘‘ఎవరు అడ్డం వచ్చినా ఈ పథకం పూర్తి చేస్తాం. నల్గొండ ప్రజల కోసమే మూసీ ప్రక్షాళన చేస్తున్నాం. ఈ పథకం ద్వారా హైదరాబాద్ తాగునీటి సమస్య పరిష్కారమే కాకుండా, నల్గొండ ఫ్లోరైడ్ సమస్య తీరుతుంది. భారత రాష్ట్ర సమితి వల్లే రంగారెడ్డి జిల్లాకు అన్యాయం జరిగింది. మూసీ నది ప్రక్షాళన ఎందుకు జరగకూడదో చెప్పాలి. త్వరలో మహారాష్ట్రకు వెళ్లి అక్కడి సీఎంను కలుస్తా.’’ అని సీఎం అన్నారు.
హైదరాబాద్‌కు దాహార్తి తీర్చింది కాంగ్రెస్ (Congress) ప్రభుత్వాలేనన్నారు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy). నల్గొండ ప్రజల కోరిక మేరకే మూసీ ప్రక్షాళన చేస్తున్నామని వివరించారు. మూసీ ప్రక్షాళనపై ఎవరు అడ్డం పడ్డా ముందుకెళ్తున్నామన్నారు. మూసీ కాలుష్యం నుంచి నల్గొండ ప్రజలకు విముక్తి కల్పిస్తామని చెప్పారు. మూసీలో హైదరాబాద్ డ్రైనేజీ కలవకుండా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. మూసీ పునరుజ్జీవంతో హైదరాబాద్‌కు తాగునీరు అందుతుందన్నారు. నల్గొండ ఫ్లోరైడ్ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
కొందరు తాటిచెట్టులా పెరిగినా బుద్ధి మాత్రం పెరగలేదంటూ ప్రతిపక్ష నేతకు చురకలంటించారు. మల్లన్నసాగర్ నుంచి గోదావరి జలాలు తీసుకు రావట్లేదన్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచే హైదరాబాద్‌కు గోదావరి జలాలు వస్తున్నాయని వివరించారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్ (Congress) పార్టీనేనని గుర్తు చేశారు. ప్రాణహిత-చేవెళ్లతో రంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. త్వరలో మహారాష్ట్ర వెళ్లి అక్కడి సీఎంతో మాట్లాడతానన్నారు. తుమ్మడిహట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మాణంపై వారితో చర్చలు జరుపుతామని తెలిపారు.
పదేళ్లలో మూసీ ప్రక్షాళనపై కేసీఆర్ (KCR) ఎందుకు ఆలోచించలేదని ప్రశ్నించారు. మూసీ నది ప్రక్షాళన హైదరాబాదులో ఎందుకు చేసుకోకూడదంటూ ప్రతిపక్షాలను ఆయన సూటిగా ప్రశ్నించారు. మోదీ, యోగి ఆదిత్యనాథ్, రేఖా గుప్తా తమ తమ రాష్ట్రాల్లోని నదులను ప్రక్షాళన చేసుకోవచ్చా? అంటూ వ్యంగ్యంగా బీజేపీ నేతలను ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళనతో కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందనే వారి భయమన్నారు. మూడు నెలల్లో ప్రపంచ నగరాల్లో హైదరాబాద్‌ను మేటిగా తీర్చిదిద్దుతామని చెప్పారు. కాంగ్రెస్ సీఎంల ప్రణాళికల వల్లే హైదరాబాద్ ఈ స్థాయికి చేరుకుందని వివరించారు. కడుపులో విషం పెట్టుకుని ప్రాజెక్టులు ఆపకండంటూ ప్రతిపక్షాలకు ఆయన సూచించారు. కలిసి రండి.. హైదరాబాద్‌ను మరింత అభివృద్ధి చేసుకుందామంటూ పిలుపునిచ్చారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తమ ప్రభుత్వం తిప్పికొడుతుందన్నారు.
నిజాం సర్కార్ దూరదృష్టితో జంట జలాశయాలను నిర్మించడం వల్లే నగరానికి వచ్చిన వాళ్లకు తాగునీరు అందుతోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సోమవారం నాడు హైదరాబాద్ సమీపంలోని గండిపేట వద్ద గోదావరి ఫేజ్ 2, 3కి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అందులో భాగంగా హైదరాబాద్ జల మండలి ఆధ్వర్యంలో నిర్మించిన 16 జలాశయాలను ఆయన ప్రారంభించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆనాటి మున్సిపల్ మంత్రి శామీర్‌పేట వద్ద గోదావరి నీళ్లు నెత్తి మీద చల్లుకున్నారని గుర్తు చేశారు. నెత్తి మీద నీళ్లు చల్లుకుంటే మీరు చేసిన పాపాలు ఎక్కడికి పోవంటూ బీఆర్ఎస్ నేతలకు ఆయన చురకలంటించారు. మూసీ నదిలో ప్రవహించే నీరు విషంగా మారి పశువులు, మనుషుల ప్రాణాలు తీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ నది నల్గొండకు విషాన్ని మోసుకెళ్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ఎవరు ఏమన్నా మూసీ నది ప్రక్షాళన చేస్తున్నామని స్పష్టం చేశారు.
Also Read : Suspicious Containers: మహారాష్ట్ర తీరానికి కొట్టుకొచ్చిన అనుమానాస్పద కంటైనర్లు
