CM Revanth Reddy: తెలంగాణ ఎప్‌సెట్‌ ఫలితాలు విడుదల చేసిన సీఎం రేవంత్

తెలంగాణ ఎప్‌సెట్‌ ఫలితాలు విడుదల చేసిన సీఎం రేవంత్

CM Revanth Reddy : తెలంగాణ ఎప్‌సెట్‌ ఫలితాలను సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) విడుదల చేశారు. హైదరాబాద్‌ లోని జూబ్లీహిల్స్‌ లోని తన నివాసంలో ఈ ఫలితాలను విడుదల చేశారు. విద్యార్థులు సాధించిన ర్యాంకులు, మార్కుల జాబితాను కూడా వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. ఇటీవల తెలంగాణ ఎప్‌సెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల ప్రిలిమినరీ కీ విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించిన విషయం తెలిసిందే. మొత్తంగా దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు ఎప్‌సెట్‌కు హాజరయ్యారు.ఇంజినీరింగ్‌ విభాగంలో మొదటి 10 ర్యాంకులూ బాలురకే వచ్చాయి. మొదటి మూడు ర్యాంకులూ ఏపీకి చెందిన విద్యార్థులకు దక్కాయి.

CM Revanth Reddy – ఇంజనీరింగ్ లో మొదటి మూడు ర్యాంకులు ఏపీ విద్యార్ధులకే

పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడకు చెందిన పల్లా భరత్‌చంద్రకు మొదటి ర్యాంకు, నంద్యాల జిల్లా కోనాపురం వాసి ఉడగండ్ల రామ్‌చరణ్‌రెడ్డికి రెండో ర్యాంకు, విజయనగరం జిల్లాకు చెందిన హేమసాయి సూర్యకార్తీక్‌కు మూడో ర్యాంకు వచ్చాయి. హైదరాబాద్‌ లోని నాచారానికి చెందిన మెండె లక్ష్మీభార్గవ్‌కు నాలుగో ర్యాంకు లభించింది. మంత్రిరెడ్డి వెంకట గణేశ్‌ రాయల్‌ (మాదాపూర్‌)కు ఐదో ర్యాంకు, సుంకర సాయి రిశాంత్‌రెడ్డి (మాదాపూర్‌) ఆరో ర్యాంకు, రష్మిత్‌ బండారి (మాదాపూర్‌) ఏడో ర్యాంకు, బనిబ్రత మాజీ (బడంగ్‌పేట్‌)కు ఎనిమిదో ర్యాంకు, కొత్త ధనుష్‌రెడ్డి (హైదరాబాద్‌)కు తొమ్మిదో ర్యాంకు, కొమ్మ కార్తీక్‌ (మేడ్చల్‌)కు పదో ర్యాంకు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

అగ్రికల్చర్‌-ఫార్మాలో

అగ్రికల్చర్‌-ఫార్మా ఫలితాల్లో మేడ్చల్‌ కు చెందిన సాకేత్‌రెడ్డికి మొదటి ర్యాంకు వచ్చింది. కరీంనగర్‌కు చెందిన సబ్బాని లలిత్‌ వరేణ్య (కరీంనగర్‌)కు రెండో ర్యాంకు, వరంగల్‌కు చెందిన అక్షిత్‌కు మూడో ర్యాంకు లభించాయి. సాయినాథ్‌ (కొత్తకోట, వనపర్తి)కు నాలుగో ర్యాంకు, బ్రాహ్మణి (మాదాపూర్‌)కి ఐదో ర్యాంకు, గుమ్మడిదల తేజస్‌ (కూకట్‌పల్లి)కు ఆరో ర్యాంకు, అఖిరానందన్‌రెడ్డి (నిజాంపేట)కు ఏడో ర్యాంకు, భానుప్రకాశ్‌రెడ్డి (సరూర్‌నగర్‌)కి ఎనిమిదో ర్యాంకు, శామ్యూల్‌ సాత్విక్‌ (హైదర్‌గూడ)కు తొమ్మిదో ర్యాంకు, అద్దుల శశికరణ్‌రెడ్డి (బాలాపూర్‌)కి పదో ర్యాంకు వచ్చాయి.

Also Read : CBI: 70 లక్షలు లంచం తీసుకుంటూ సీబీఐకు చిక్కిన ఆదాయపన్ను శాఖ కమిషనర్‌

Leave A Reply

Your Email Id will not be published!