CM Siddaramaiah : రాజకీయాల్లోకి సీఎం సిద్దరామయ్య మనవడు ధవన్ రాకేశ్ ?
రాజకీయాల్లోకి సీఎం సిద్దరామయ్య మనవడు ధవన్ రాకేశ్ ?
CM Siddaramaiah : రాజకీయాలలోకి వారసులు రావడం కొత్తేమి కాదు. అయితే వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా మాట్లాడే సీఎం సిద్దరామయ్య మరో వారసుడు రాజకీయాలలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు చర్చలు జోరందుకున్నాయి. ఇప్పటికే సిద్దరామయ్య కుమారుడు డాక్టర్ యతీంద్ర… వరుణ నియోజకవర్గం నుంచి ఓసారి ఎమ్మెల్యేగా కొనసాగి, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే సీఎం మనవడు ధవన్ రాకేశ్‌ను రాజకీయాల్లోకి తీసుకొచ్చే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది.
CM Siddaramaiah Grand Son Political Entry
సిద్దరామయ్య (CM Siddaramaiah) రాజకీయ వారసుడిగా పెద్ద కుమారుడు రాకేశ్ ను రాజకీయాల్లోకి తీసుకురావాలని ప్రయత్నించారు. అయితే రాకేశ్ అకాలమరణం చెందిన విషయం తెలిసిందే. ఆ తర్వాతనే యతీంద్రను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. సిద్దరామయ్య మరోసారి పోటీ చేసే ఆలోచనలో లేనట్లు తెలుస్తోంది. గత ఎన్నికల వేళ వరుణ నియోజకవర్గంలో ఇవే చివరి ఎన్నికలని ప్రకటించారు. నామినేషన్ సమయంలోనూ ధవన్ రాజకీయాల్లోకి వస్తారని ప్రస్తావించిన విషయం కూడా ఉంది. మారుతున్న రాజకీయాలలో రిటైర్డు అయ్యేది లేదని ఇటీవలే ప్రకటించారు.
ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్న వరుణ నుంచి మనవడు ధవన్‌ను పోటీ చేయించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వరుణలో అంబేడ్కర్ విగ్రహావిష్కరణలో రాకేశ్‌ను కాంగ్రెస్ నాయకులు స్మరించారు. ఇదే సందర్భంలోనే పలువురు నాయకులు ధవన్‌ను రాజకీయాలలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇలా ధవన్ రాజకీయ ప్రవేశానికి అడుగులు పడుతునట్లు తెలుస్తోంది. అదే జరిగితే మరో కుటుంబం నుంచి వారసుడు రాజకీయాల్లోకి ప్రవేశించే అవకాశం ఉంది.
CM Siddaramaiah – వీల్ చైర్లోనే పార్లమెంటుకు వెళ్తా – మాజీ ప్రధాని దేవెగౌడ
రాజకీయాలనుంచి రిటైర్డు అయ్యేది లేదని, ప్రస్తుతం 93ఏళ్లు అని ఆరోగ్య సమస్యలు ఉన్నాయని అయినా వీల్ చైర్లోనే పార్లమెంటుకు వెళ్తానని మాజీ ప్రధాని దేవెగౌడ అన్నారు. హాసన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… చెన్నై – బెంగళూరు నేషనల్ ఎక్స్‌ప్రెస్ వే, బెంగళూరు – హైదరాబాద్ హైవేల ప్రాధాన్యత ప్రధానమంత్రికి వివరించానని, వచ్చే బడ్జెట్లో ఎక్కువ గ్రాంట్లు రానున్నాయన్నారు.
కావేరి, కృష్ణా నదుల నీటి కేటాయింపులు, రోడ్ల విస్తరణ అవసరమన్నారు. అస్కర్ ఫెర్నాండెజ్ కాలంలో శిరాడిఘాట్ వద్ద సొరంగమార్గం నిర్మించాలని ప్రతిపాదనలు సూచించానని, అయితే ఇప్పటికీ సాధ్యం కాలేదన్నారు. వయసు పైబడినా రాజకీయ ప్రయోజనాలకోసం మాట్లాడనన్నారు. 65ఏళ్ల పాటు రాజకీయ జీవనంలో కొనసాగానని, రాష్ట్ర అభివృద్ధికి శక్తికి మించి పోరాటం చేశానన్నారు.
Also Read : Karnataka High Court: మలూర్ ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదంటూ కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు
