CM Siddaramaiah : పూలు..శాలువాలు వద్దు పుస్తకాలు చాలు
కర్ణాటక సీఎం సిద్దరామయ్య కామెంట్స్
CM Siddaramaiah : క్లీన్ ఇమేజ్ కలిగిన సీఎం సిద్దరామయ్య రెండో సారి కొలువు తీరారు. ఆ వెంటనే ఆయన రంగంలోకి దిగారు. తాము ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఇక నుంచి బొకేలు, పుష్పాలు, శాలువాలు తీసుకోనని ప్రకటించారు. వాటికి బదులు పుస్తకాలు ఇస్తే తీసుకుంటానని ప్రకటించారు. ప్రస్తుతం సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) చేసిన ప్రకటన కలకలం రేపుతోంది.
టెక్నాలజీ డామినేట్ చేస్తున్న ఈ తరుణంలో పుస్తకాల విలువను మరోసారి చాటి చెప్పారు సిద్దరామయ్య. ప్రజలు ఎవరైనా తనను కలవాలని అనుకుంటే ఎలాంటి కానుకలు, బహుమతులు తీసుకోనని కేవలం జీవితాన్ని ప్రభావితం చేసే పుస్తకాలు అయితే చాలని పేర్కొన్నారు సీఎం. ఇక మేనిఫెస్టోలో ప్రకటించిన 5 హామీలకు కేబినెట్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందన్నారు సిద్దరామయ్య.
వివిధ కార్యక్రమాలలో గౌరవ సూచకంగా ప్రజలు ఇచ్చే పూలు , శాలువాల కంటే పుస్తకాలకు ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం చేశారు. ఎవరైనా తమ ప్రేమను తెలియ చేయాలని అనుకుంటే అవి తప్ప మంచిని ప్రేరేపించే ఏ పుస్తకాలైనా తనకు ఇవ్వవచ్చని పేర్కొన్నారు. ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని తెలిపారు. గృహ జ్యోతి అమలుకు రూ. 1,200 కోట్లు అవసరమని అంచనా వేశామన్నారు సీఎం. పెన్షన్లను కూడా త్వరలోనే ఇస్తామని ప్రకటించారు.
Also Read : WFI Chief Demands