CM Siddaramaiah : యడ్యూరప్పపై సిద్దరామయ్య కన్నెర్ర
ఆయనకు నైతిక హక్కు లేదని ఫైర్
CM Siddaramaiah : కర్ణాటక సీఎం సిద్దరామయ్య నిప్పులు చెరిగారు. సోమవారం ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వంపై బీజేపీ అగ్ర నేత, మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప నిరసనకు పిలుపు ఇవ్వడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు ఎలాంటి పనీ పాటా లేదని ఎద్దేవా చేశారు. ఏ నైతిక హక్కు ఉందని తమను ప్రశ్నిస్తారని నిలదీశారు సీఎం సిద్దరామయ్య. గతంలో భారతీయ జనతా పార్టీ కూడా మేనిఫెస్టో ప్రకటించింది. మరి అందులో చెప్పినవన్నీ చేశారా అని ప్రశ్నించారు యెడ్డీపై భగ్గుమన్నారు.
కాంగ్రెస్ పార్టీ 2013లో ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేశామన్నారు. ఇదే సమయంలో ఇటీవల తాము ప్రకటించిన 5 గ్యారెంటీ పథకాలను కూడా అమలు చేసేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah). తాము కొలువు తీరి కొన్ని రోజులే అయ్యిందని అంతలోపే చిల్లర రాజకీయాలు చేస్తామంటే ఎలా అని ఎద్దేవా చేశారు. తాము ఏం చెప్పామో దానినే అమలు చేసేందుకు కృత నిశ్చయంతో ఉన్నామని స్పష్టం చేశారు సిద్దరామయ్య.
బీజేపీ నేతలకు ఎదుటి వారి మీద రాళ్లు వేయడం తప్ప పని ఎలా చేయాలో తెలియదన్నారు. అందుకే తమకు బంపర్ మెజారిటీ కట్టబెట్టారని వారిని ప్రతిపక్షంలో కూర్చో బెట్టారని సెటైర్ వేశారు సీఎం. ఇకనైనా బీఎస్ యడ్యూరప్ప గతం గురించి కొంత తెలుసుకుని మాట్లాడితే బెటర్ అని సూచించారు సిద్దరామయ్య. కాగా తాజాగా సీఎం చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
Also Read : Asaduddin Owaisi : ఎమ్మెల్యే షకీల్ పై ఓవైసీ ఫైర్
