CM Siddaramaiah : బియ్యానికి బదులు నగదు – సీఎం
బీపీఎల్ కుటుంబాలకు ఊరట
CM Siddaramaiah : కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం సీఎం సిద్దరామయ్య కీలక ప్రకటన చేశారు. బీపీఎల్ కార్డుదారులకు బియ్యానికి బదులు నగదు జమ చేస్తామని స్పష్టం చేశారు. జూలై 1 నుంచి కిలోకు రూ. 34 లబ్దిదారులకు దక్కుతుందని తెలిపారు. బియ్యం సేకరణలో తీవ్రమైన ఇబ్బందులు తలెత్తాయని అందు వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు సీఎం సిద్దరామయ్య.
దారిద్ర రేఖకు దిగువన ఉన్న నిరుపేదల కుటుంబాలను ఆదుకునేందుకు గాను తాము ఎన్నికల్లో ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేస్తామని ప్రకటించామని, ఈ మేరకు హామీ కూడా ఇచ్చామని తెలిపారు సీఎం. దీనికి అన్న భాగ్య అని శ్రీకారం చుట్టారు. ఆరు నూరైనా సరే పంపిణీ చేసి తీరుతామని వెల్లడించారు. కానీ ఎన్నో ప్రయత్నాలు చేసినా చివరకు బియ్యాన్ని అందించలేమని నిర్ధారణకు వచ్చింది ప్రభుత్వం.
దీంతో ఇచ్చిన మాట ప్రకారం లబ్దిదారులు ఎవరైతే ఉన్నారో వారందినీ గుర్తించి కిలోకు రూ. 34 చొప్పున ప్రతి ఒక్క కుటుంబానికి సంబంధించిన బ్యాంకు ఖాతాలలో నగదును సమ చేస్తామని తెలిపారు సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah). కాగా సీఎం సీరియస్ కామెంట్స్ చేశారు. అన్న భాగ్య కు సంబంధించి బియ్యాన్ని ఇవ్వకుండా కేంద్రం కొర్రీలు వేసిందని ఆరోపించారు. తాము డబ్బులు కట్టేందుకు సిద్దంగా ఉన్నా ఎఫ్ సీఐ నుంచి పర్మిషన్ ఇవ్వలేదని మండిపడ్డారు. కాగా రూ. 20 కేజీ బియ్యం చొప్పున కేంద్రం ఇథనాల్ కోసం ఇస్తోందని సంచలన ఆరోపణలు చేశారు సిద్దరామయ్య.
Also Read : Buggana Rajendranath Reddy : అభివృద్దికి విరోధి చంద్రబాబు