Punjab CM vs Governor : పంజాబ్ లో సీఎం వర్సెస్ గవర్నర్
ముదిరిన వివాదం ఆప్ ఆగ్రహం
Punjab CM vs Governor : మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కొలువు తీరాక బీజేపీయేతర రాష్ట్రాలలో గవర్నర్లు అనుసరిస్తున్న వ్యవహారం వివాదాస్పదంగా మారింది.
అసెంబ్లీ నిర్వహించాలని కోరుతూ ఏకంగా సీఎం భగవంత్ మాన్ సారథ్యంలో కేబినెట్ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. విశ్వాస పరీక్షపై పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ , గవర్నర్ ల(Punjab CM vs Governor) మధ్య వాగ్వాదం మరింత ముదిరింది.
ఇదిలా ఉండగా దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది పురోహిత్ వ్యవహారం. ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ తో పాటు సీఎం భగవంత్ మాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనే చేశారంటూ మండిపడ్డారు.
ఇదిలా ఉండగా కేబినెట్ ప్రతిపాదించిన రెండో ప్రత్యేక శాసనసభ సెషన్ ఎజెండాను ఇవ్వాలంటూ కోరారు గవర్నర్. ఇదిలా ఉండగా భగవంత్ మాన్ సంచలన కామెంట్స్ చేశారు.
75 ఏళ్లలో శాసనసభ సమావేశాలకు సంబంధించిన జాబితాను ఏ రాష్ట్రపతి లేదా గవర్నర్ అడగ లేదని ఆరోపణలు చేశారు. ఇదే విషయాన్ని అధికారిక ట్విట్టర్ లో పేర్కొన్నారు సీఎం(Bhagwant Mann).
సెప్టెంబర్ 27 నాటి ప్రతిపాదత సెషన్ ను కేబినెట్ ఆమోదించింది. విద్యుత్ రంగంతో పాటు ఇతర ప్రధాన సమస్యలపై చర్చించనున్నట్లు కేబినెట్ తీర్మానం చేసిందని ఆప్ సర్కార్ స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా ప్రత్యేక సమావేశంలో ప్రభుత్వానికి అనుకూలంగా విశ్వాస తీర్మానం ఉంటుందా అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి హర్బాల్ సింగ్ చీమా సమాధానం చెప్పకుండా దాటవేసే ప్రయత్నం చేశారు.
Also Read : గవర్నర్ ను కలిసిన అఖిలేష్ యాదవ్