CM Yogi Adityanath : యూసీసీపై అభ్యంతరం ఎందుకు – సీఎం
ప్రశ్నించిన యూపీ యోగి ఆదిత్యానాథ్
CM Yogi Adityanath : దేశ వ్యాప్తంగా యూనిఫాం సివిల్ కోడ్ గురించి చర్చలు జరుగుతున్నాయి. విపక్షాలు ఒప్పుకోవడం లేదు. దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ తాము అడ్డుకుని తీరుతామని ప్రకటించాయి. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే యూసీసీని అమలు చేసి తీరుతామని ప్రకటించారు. దీనిపై తీవ్ర స్థాయిలో అభ్యంతరం తెలిపారు డీఎంకే చీఫ్ , తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్.
కేంద్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ సర్కార్ యూసీసీ వైపు మొగ్గు చూపుతోంది. దీనినే ఎన్నికల నినాదంగా మందుకు తీసుకు పోవాలని యోచిస్తోంది. ఇప్పటికే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా కూడా యూనిఫాం సివిల్ కోడ్ ను అమలు చేస్తామని ప్రకటించారు. ఇదిలా ఉండగా మోదీ, షా చేసిన ప్రకటనకు మద్దతు పలికారు ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్(CM Yogi Adityanath). గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
యూసీసీ అనేది దేశంలో ప్రతి ఒక్కరికీ ఒకటే కోడ్ అనేది వర్తిస్తుందన్నారు సీఎం. దీనిపై ఎందుకు ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయో తెలియడం లేదని పేర్కొన్నారు. ఈ రోజుల్లో దేశంలో ఏక రూప చట్టం అంటే కామన్ సివిల్ కోడ్ అమలు చేయాలని భారత దేశ సర్వోన్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు చెబుతోందని దానిని కూడా మీరు ఒప్పుకోరా అంటూ నిప్పులు చెరిగారు సీఎం యోగి ఆదిత్యానాథ్.
Also Read : Germany Ambassdor : ఖర్గేతో జర్మనీ రాయబారి భేటీ