AP CM YS Jagan : ఏపీ సీఎం సంచ‌ల‌న నిర్ణ‌యం

ప్లాస్టిక్ వాడ‌కంపై ప్ర‌భుత్వం ఉక్కుపాదం

AP CM YS Jagan :  ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం సందింటి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. 2027 సంవ‌త్స‌రం నాటిక‌ల్లా ప్లాస్టిక్ ర‌హిత రాష్ట్రంగా మారుస్తామ‌ని ప్ర‌క‌టించారు.

ఇందుకు సంబంధించి ప్ర‌భుత్వం క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకుంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. ప‌ర్యావ‌ర‌ణం అన్న‌ది కాపాడుకోక పోతే భ‌విష్య‌త్తులో తీవ్ర ఇబ్బందులు త‌లెత్తే ప్రమాదం ఉందంటూ హెచ్చ‌రించారు.

మెల మెల్ల‌గా ప్లాస్టిక్ వాడ‌కాన్ని త‌గ్గించుకుంటూ రావాల్సిందేనంటూ పేర్కొన్నారు సీఎం. ఇందులో భాగంగా ప్లాస్టిక్ వ్య‌ర్థాల నియంత్ర‌ణ కోసం జీఏఎస్పీ , పార్లే సంస్థ‌తో స‌ర్కార్ భాగస్వామ్యం క‌లిగి ఉంద‌న్నారు.

విశాఖ‌ప‌ట్ట‌ణంలో ప్లాస్టిక్ రీ సైక్లింగ్ , అప్ సైక్లింగ్ హ‌బ్ లు ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ప్ర‌పంచంలోనే తొలి సారిగా ఈ త‌ర‌హా ప్రాజెక్టుకు శ్రీ‌కారం చుట్ట‌డం ఒక్క ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనే జ‌రుగుతోంద‌న్నారు సందింటి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.

అంతే కాకుండా వ్య‌ర్థాల‌తో ఉత్ప‌త్తులు త‌యారు చేసేందుకు గాను 10 ఇన్నోవేష‌న్ (ఆవిష్క‌ర‌ణ‌) హ‌బ్స్ కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు సీఎం. రూ. 16 వేల కోట్ల పెట్టుబ‌డులతో సుమారు 20 వేల మందికి పైగా ఉపాధి దొరుకుతుంద‌న్నారు.

ఇక నుంచి రాష్ట్ర మంత‌టా ప్లాస్టిక్ బ్యాన‌ర్ల‌ను నిషేధిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు జగ‌న్ రెడ్డి(AP CM YS Jagan) . అమెరికాకు చెందిన స్వ‌చ్చంధ సంస్థ పార్లే ఫ‌ర్ ది ఓష‌న్స్ స్వ‌చ్చంధ సంస్థ‌తో ఒప్పందం చేసుకుంది. ఏపీ స‌ర్కార్, ఎన్జీఓ మ‌ధ్య‌న ఎంఓయూ కుదుర్చుకున్నారు.

విశాఖలో పార్లే సూప‌ర్ హ‌బ్ , రీ స్లైక్లింగ్ , అప్ సైక్లింగ్ యూనిట్ల‌ను ఏర్పాటు చేస్తార‌న్నారు జ‌గ‌న్ రెడ్డి. సాఫ్ట్ స్కిల్స్ లో ల‌క్షా 62 వేల మందికి మైక్రో సాఫ్ట్ ద్వారా శిక్ష‌ణ ఇవ్వాల‌ని స‌ర్కార్ నిర్ణ‌యించింది.

ఇందులో భాగంగా ఇప్ప‌టికే 35,980 మందికి ట్రైనింగ్ పూర్త‌యింది. వారికి స‌ర్టిఫికెట్ల‌ను ప్ర‌దానం చేశారు సీఎం.

Also Read : సాఫ్ట్ స్కిల్స్ లో ఏపీ షాన్ దార్

Leave A Reply

Your Email Id will not be published!