YS Jagan : ఏపీలో సహాయక చర్యలపై సీఎం ఆరా
ఏ ఒక్కరూ ఇబ్బంది పడ కూడదు
YS Jagan : రుతు పవనాల తాకిడికి వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి. ఎగువ నుంచి వరద నీరు పెద్ద ఎత్తున వస్తోంది. గోదావరి ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది.
దీంతో ఏపీలోని పలు జిల్లాల్లోకి నీరు చేరింది. గోదావరి వరదలు, సహాయక కార్యక్రమాలపై ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి సమీక్ష చేపట్టారు.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆరా తీశారు. వరద ప్రభావిత జిల్లాలకు సీనియర్ అధికారులను పర్యవేక్షకులుగా నియమించారు. హై అలర్ట్ గా ఉండాలని ఆదేశించారు సీఎం.
ముంపు గ్రామాలు, వరద బాధితుల కోసం ఏర్పాటు చేసిన శిబిరాలు, అందుతున్న సౌకర్యాలు, నిత్యావసరాల సరఫరా, అత్యవసర సేవలు, మందులు అందుతున్నాయా లేదా అనే దానిపై ప్రత్యేకంగా వివరాలు అడిగారు.
విధుల్లో నిర్లక్ష్యం వహించ కూడదంటూ హెచ్చరించారు. ఏ ఒక్కరూ ఇబ్బందికి లోను కాకూడదంటూ జగన్ రెడ్డి(YS Jagan) స్పష్టం చేశారు. గోదావరి వరద ప్రభావిత ప్రాంతాలలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు సీఎం.
గోదావరి నదీ పరివాహక ప్రాంతాలో ఉన్న గ్రామాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలని సూచించారు. గండ్లు పడకుండా చూసు కోవాలని అన్నారు. సహాయ శిబిరాల్లో ఉంచే ప్రతి కుటుంబానికీ రూ. 2 వేల రూపాయలు ఇవ్వాలని ఆదేశించారు సీఎం.
అత్యవసర పరిస్థితుల్లో వినియోగించు కునేందుకు గాను రెండు హెలికాప్టర్లను సిద్దం చేశామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు జగన్ రెడ్డి.
అంతకు ముందు ఆయన గోదావరి జిల్లాల్లో ఏరియల్ సర్వే చేపట్టారు. ముంపు మండలాలపై కూడా ప్రత్యేక శ్రద్ద పెట్టాలని ఆదేశించారు జగన్ రెడ్డి.
Also Read : గోదారమ్మ ఉగ్ర రూపం జనం అస్తవ్యస్తం