YS Jagan : నిరుద్యోగులకు సీఎం జగన్ ఖుష్ కబర్
8 వేల పోస్టుల తక్షణ భర్తీకి ఆదేశం
YS Jagan : దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యా రంగాన్ని బలోపేతం చేస్తున్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తాను ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో సక్సెస్ అయ్యారు.
ప్రధానంగా అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తానని ప్రకటించారు. భారీ ఎత్తున కొలువులు భర్తీ చేశారు.
అంతే కాదు రాష్ట్ర ప్రజలకు సేవలందిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) ను ప్రభుత్వంలో విలీనం చేశారు.
ఆర్టీసీ ఉద్యోగులు ఇక నుంచి సర్కారు ఉద్యోగులే. తాజాగా నిరుద్యోగులకు మరింత వెసులుబాటు కల్పిస్తూ ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆదేశించారు. ఇప్పటికే జాబ్ క్యాలెండర్ ను రిలీజ్ చేశారు సీఎం జగన్ రెడ్డి(YS Jagan).
తాజాగా వివిధ శాఖల అధికారులతో సమీక్ష చేపట్టారు. ఉన్నత విద్యా శాఖలో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆదేశించారు సీఎం.
అంతే కాకుండా పోలీసుల భర్తీకి కూడా యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని సూచించారు. ఇదిలా ఉండగా 2021-22 సంవత్సరానికి జాబ్ క్యాలెండర్ ద్వారా 39,654 పోస్టులు భర్తీ చేసినట్లు ఉన్నతాధికారులు సీఎంకు వివరించారు.
యుద్ద ప్రాతిపదికన ఉద్యోగాల నియామకానికి సంబంధించి ప్రతిపాదనలు తయారు చేయాలని స్పష్టం చేశారు జగన్ మోహన్ రెడ్డి(YS Jagan). ప్రధానంగా విద్య, ఆరోగ్యంపై ఫోకస్ పెట్టాలని అన్నారు.
ఆయా రంగాలలో ఖాళీలను కూడా వెంటనే భర్తీ చేయాలన్నారు. ఇక ఉన్నత విద్యలో ఖాళీల భర్తీని పారదర్శకతకు, సమర్థతకు పట్టం కట్టాలన్నారు సీఎం. పోలీసు నియామకాలను పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు చేపట్టాలని జగన్ రెడ్డి ఆదేశించారు.
Also Read : రాకేశ్ కుటుంబానికి కేసీఆర్ భరోసా