#JustinLanger : టీమిండియా ఆట అద్భుతం : ఆసిస్ కోచ్ జస్టిన్ లాంగర్
వాళ్లు కష్టపడ్డారు గెలుపొందారు
Langer : కోచ్ అంటే ఇలా ఉండాలి. ఆట అంటేనే గెలుపు ఓటములు. ఒకరు ఓడిపోతారు. ఇంకొకరు గెలుస్తారు. అందరూ గెలిచిన వాళ్లను చూస్తారు. ఇంకొందరు ఓటమి పొందిన వాళ్లను గమనిస్తారు. విజయం మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపితే, అపజయం అనుభవాన్ని మిగులుస్తుంది. తమ జట్టు ఓటమిని ఒప్పుకుంటూనే ప్రత్యర్థి జట్టు ఎంత బాగా ఆడిందో తనదైన శైలిలో చెప్పాడు ఆస్ట్రేలియా క్రికెట్ టీం కోచ్ జస్టిన్ లాంగర్.
ఇండియా ఆసిస్ జట్ల మధ్య జరిగిన నాలుగు టెస్టు మ్యాచ్ల్లో ఇండియా రెండు నెగ్గి ఒకటి డ్రా తో సరిపెట్టుకుంది. ఆసిస్ మొదటి, నాలుగో టెస్ట్ ఓడి పోయింది. బోర్డర్ గావస్కర్ ట్రోఫీని గెలుపొందింది ఇండియా జట్టు. అనంతరం ఆసిస్ కోచ్(Langer )టీమిండియా సాధించిన విజయం గురించి చెప్పారు. ఆట పట్ల వారికున్న పట్టుదల తనను ఎంతగానో ఆకట్టుకుందన్నారు.
మొదటి టెస్టు లో ఓడిపోయిన జట్టు అనూహ్యంగా గెలవడం అన్నది అద్భుతమైనదిగా పేర్కొన్నాడు. ప్రతి ఒక్క ఆటగాడు కసితో ఆడాడు. వారు అనేక రకాలుగా వత్తిళ్ల మధ్య ఆట ఆడారు. ఇరు జట్లు హోరా హోరీగా తలపడ్డాయి. వారు మాకంటే అన్నింటా ముందంజలో ఉన్నారు. గాయాలు కొన్ని మమ్మల్ని వారిని ఇబ్బందులకు గురి చేశాయి.
కానీ ఇండియన్ కుర్రాళ్లు రాటు దేలారు. తమ ప్రతిభకు మెరుగులు దిద్దారు. అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించారు. వారి ఆత్మవిశ్వాసం ముందు ఓటమి తలవంచిందన్నారు జస్టిన్ లాంగర్(Langer ). లాంగర్ చేసిన వ్యాఖ్యలపై క్రికెట్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
No comment allowed please