Coka 2.0 Liger Song : లైగర్ కోకా 2.0 సాంగ్ కెవ్వు కేక
సోషల్ మీడియాలో సెన్షేషన్
Coka 2.0 Liger Song : డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, లవ్లీ బ్యూటీ అనన్య పాండే కలిసి నటించిన లైగర్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.
ఇప్పటికే విడుదల చేసిన టీజర్స్ , పోస్టర్లు, సాంగ్స్ దుమ్ము రేపుతున్నాయి. ఇక ప్రమోషన్ సైతం వీర లెవల్లో కొనసాగుతోంది. ఇక లైగర్ చిత్ర బృందానికి ఎక్కడికి వెళ్లినా పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తోంది.
ఇప్పటికే రిలీజ్ చేసిన ఒక్కో పాట సెన్సేషన్ సృష్టిస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. తాజాగా మూవీ మేకర్స్ మూడో సాంగ్ కోకా 2.0(Coka 2.0 Liger Song) పేరుతో విడుదల చేశారు.
మిలియన్ల కొద్దీ వ్యూస్ తో దూసుకు పోతోంది ఈ సాంగ్. కొరియో గ్రఫీ, మ్యూజిక్, సాంగ్ పూర్తిగా మ్యాజిక్ చేసేసింది. ఈ పాటను పూర్తిగా పంజాబీ, రాజస్థానీ స్టైల్ లో చిత్రీకరించారు.
తెలుగులో గీతా మాధురీ, రామ్ మిర్యాలా పాడితే భాస్కర భట్ల రవి కుమార్ పాటను రాశాడు. ఇక రౌడీ బాయ్ ..అనన్య పాండే రెచ్చి పోయి పోటా పోటీగా నటించారు.
అన్ని పాటల కంటే ఈ కోకా సాంగ్ కెవ్వు మనిపించేలా(Coka 2.0 Liger Song) ఉంటోంది. దీంతో లైక్ లు, షేరింగ్ లతో దద్దరిల్లుతోంది. ఇక పాట పరంగా చూస్తే జానీ, లిజో జార్జ్ , డీజే చేతన్ ఈ ట్రాక్ ను కంపోజ్ చేశారు.
జానీ ఈ పాటను హిందీలో రచించారు. దీనిని సుఖే, లిసా మిశ్రా పాడారు. అజీమ్ దయానీ మ్యూజిక్ ను పర్యవేక్షించారు. ఇక లైగర్ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ , చార్మీ కౌర్ , కరణ్ జోహార్ , అపూర్వ మెహతా నిర్మించారు.
ఇది పాన్ ఇండియాగా రాబోతోంది ఆగస్టు 25న ప్రపంచ వ్యాప్తంగా. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో రాబోతోంది.
Also Read : విజయ్ దేవరకొండపై రష్మిక కామెంట్స్