Puri Stampede: పూరీ తొక్కిసలాట ఘటనలో కలెక్టర్, ఎస్పీలపై బదిలీ వేటు
పూరీ తొక్కిసలాట ఘటనలో కలెక్టర్, ఎస్పీలపై బదిలీ వేటు
Puri Stampede : ఒడిశాలోని పూరీ జగన్నాథ రథయాత్రలో గుండిచా ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మృతి చెందగా… 50 మందికి పైగా గాయపడిన ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఒడిశా ప్రభుత్వం జిల్లా కలెక్టర్ సిద్ధార్థ శంకర్ స్వైన్, పూరీ పోలీస్ సూపరింటెండెంట్ వినిత్ అగర్వాల్ లను బదిలీ చేస్తూ… ఉత్తర్వులు జారీ చేసింది. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు. ఖుర్దా కలెక్టర్ చంచల్ రాణా నూతన జిల్లా మేజిస్ట్రేట్‌గా బాధ్యతలు స్వీకరిస్తారని… ప్రస్తుతం ఏడీజీ (క్రైమ్)గా ఉన్న సీనియర్ పోలీసు అధికారి పినాక్ మిశ్రా ఎస్పీగా విధుల్లో చేరతారని తెలిపారు.
Puri Stampede – తొక్కిసలాట ఘటనపై స్పందించిన సీఎం
పూరి తొక్కిసలాట (Puri Stampede) ఘటనపై ఒడిశా సీఎం మోహన్ చరణ్ స్పందించారు. ప్రభుత్వం తరఫున క్షమాపణలు భక్తులను క్షమాపణలు కోరారు. భద్రతా వైఫల్యంపై దర్యాప్తునకు ఐదుగురు సభ్యులతో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశామన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. రథయాత్ర ముగిసే వరకు ఎటువంటి అసాధారణ ఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.
మరోవైపు.. ఈ తొక్కిసలాట (Puri Stampede) ఘటన కారణంగా బీజేపీ ప్రభుత్వంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి. ఆ క్రమంలో ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ స్పందించారు. ఈ ఘటన రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతను చాటు తుందందని మండిపడ్డారు. రథయాత్ర నిర్వహణలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని తెలిపారు. రథయాత్ర నిర్వహణను సక్రమంగా నిర్వహించడం కూడా ఈ ప్రభుత్వానికిి చేత కాలేదని చెప్పారు. భక్తుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి మాజీ సీఎం నవీన్ పట్నాయక్ సూచించారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సైతం స్పందించారు. ఈ తొక్కిసలాట ఘటనపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరితగతిన కోలుకోవాలని ఆకాంక్షించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఈ సందర్భంగా ఒడిశా ప్రభుత్వాన్ని ఆయన కోరారు. తొక్కిసలాట ఘటన నేపథ్యంలో సహాయక చర్యలో పాల్గొనాలంటూ ఒడిశా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఆయన పిలుపు నిచ్చారు. ఈ తరహా ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఒడిశా ప్రభుత్వానికి రాహుల్ గాంధీ సూచించారు.
Also Read : 90 Degree Bridge: 90 డిగ్రీల వంతెన నిర్మాణం చేసిన ఏడుగురు ఇంజినీర్ల సస్పెన్షన్
