Justice UU Lalit : కొలిజియం వ్య‌వ‌స్థ స‌రైన‌దే – మాజీ సీజేఐ

కేంద్ర న్యాయ శాఖ మంత్రికి స్ట్రాంగ్ కౌంటర్

Justice UU Lalit : కొలీజియం వ్య‌వ‌స్థ‌పై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేసిన కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజుపై సీరియ‌స్ గా స్పందించారు భార‌త దేశ మాజీ ప్ర‌ధాన న్యాయ‌మూర్తి (సీజేఐ ) జ‌స్టిస్ యుయు ల‌లిత్(Justice UU Lalit) . అత్యున్న‌త న్యాయ స్థానానికి న్యాయ‌మూర్తుల‌ను నియ‌మకాల‌ను ఈ కొలీజియం సిఫార‌సు చేస్తుంది.

దీని ద్వారా కేంద్ర ప్ర‌భుత్వం న్యాయ శాఖ మంత్రితో స‌మావేశం అవుతుంది. ఇందులో ప్ర‌ధాన‌మంత్రి నేతృత్వంలో స‌మీక్ష జ‌రుపుతారు. ఆ త‌ర్వాత ఎంపిక ప్ర‌క్రియ‌కు ఆమోదం తెలుపుతారు. అనంత‌రం భార‌త రాష్ట్ర‌ప‌తి చేత సీజేఐగా ప్ర‌మాణ స్వీకారం చేస్తారు. దీనికి పెద్ద త‌తంగ‌మే ఉంటుంది.

ఈ మొత్తం ఎంపిక ప్ర‌క్రియ‌పై గ‌త కొంత కాలం నుంచి కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. బ‌హిరంగంగానే కామెంట్స్ చేస్తూ కాకా పుట్టిస్తున్నారు. అంతే కాదు కేసులు ప‌రిష్క‌రించాల్సిన న్యాయ‌మూర్తులు రాజ‌కీయాలు చేస్తున్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు కూడా చేశారు.

దీనిపై న్యాయ వ్య‌వ‌స్థ తీవ్ర అభ్యంత‌రం తెలిపింది. ఆపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఇటీవ‌ల కేంద్ర మంత్రి మ‌రో కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌పంచంలో ఎక్క‌డా కొలీజియం ప‌ద్ద‌తిలో న్యాయ‌మూర్తుల‌ను నియ‌మించ‌డం లేద‌న్నారు. దీనిపై తీవ్రంగా రియాక్ట్ అయ్యారు మాజీ సీజేఐ జ‌స్టిస్ ల‌లిత్. ఆయ‌న ఇటీవ‌లే రిటైర్ అయ్యారు.

ఆయ‌న స్థానంలో జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్ 50వ సీజేఐగా కొలువు తీరారు. సుప్రీంకోర్టుకు న్యాయ‌మూర్తుల‌ను నియ‌మించేందుకు ఏర్పాటైన కొలీజియం వ్య‌వ‌స్థ పూర్తిగా స‌రైన‌దేన‌ని స్ప‌ష్టం చేశారు జ‌స్టిస్ యుయు ల‌లిత్(Justice UU Lalit) .

Also Read : చెర‌సాల‌ను వీడిన న‌ళిని శ్రీ‌హ‌ర‌న్

Leave A Reply

Your Email Id will not be published!