Bhanakacherla Project: పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వలేం నిపుణుల కమిటీ
పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వలేం నిపుణుల కమిటీ
Bhanakacherla Project : పోలవరం – బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మాణంపై కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత దశలో ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వలేమని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. ప్రాజెక్టుపై అనేక అభ్యంతరాలు వచ్చాయని… అనుమతులు ఇవ్వాలంటే గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రైబ్యునల్ (జీడబ్ల్యూడీటీ) తీర్పును పరిశీలించాల్సి ఉందని తెలిపింది. పర్యావరణ అనుమతులకు సీడబ్ల్యూసీని సంప్రదించడం అత్యవసరమని కమిటీ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్‌పై ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్ర పర్యావరణ నిపుణుల మదింపు కమిటీ వెనక్కి పంపింది. అంతే కాకుండా మూడు కీలక సూచనలు చేసింది.
Bhanakacherla Project – బనకచర్ల ప్రాజెక్టుపై నిపుణుల కమిటీ సూచనలు
1. ప్రాజెక్టు ప్రతిపాదకులు (PP) కేంద్ర జల సంఘం (CWC) సహాయంతో వరద నీటి లభ్యతపై సమగ్ర అధ్యయనం చేయాలి.
2. Godavari Water Disputes Tribunal Award, 1980కి విరుద్ధంగా ఉందన్న ఆరోపణలను పరిగణనలోకి తీసుకోవాలి.
3. TOR తయారీకి ముందు రాష్ట్రాల మధ్య జల పంపిణీపై క్లారిటీ కోసం కేంద్ర జల కమిషన్ అనుమతి తీసుకోవాలి.
బనకచర్ల ప్రాజెక్టును (Bhanakacherla Project) ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేపట్టినట్లు ఏపీ (AP) ప్రభుత్వం ఇచ్చిన నివేదికను నిపుణుల కమిటీ పరిశీలించింది. అయితే, 1983లో గోదావరి ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారని అభిప్రాయపడింది. ఈ ప్రాజెక్టులో నీటి నిల్వపై కేంద్రంతో అధ్యయనం, రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలకు అన్ని అనుమతులు, పర్యావరణ ప్రభావంపై అంచనా వేసిన తర్వాతే ప్రాజెక్టుకు పూర్తిస్థాయి అనుమతివ్వడానికి సాధ్యమవుతుందని నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది.
సముద్రంలో కలిసే గోదావరి నది మిగుల జలాలను మళ్లించి.. రాయలసీమ జిల్లాలకు అందించాలని చంద్రబాబు ప్రభుత్వం భావించింది. అందుకోసం బనకచర్ల ప్రాజెక్ట్‌ను నిర్మించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. అయితే ఏపీ చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల తమ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందంటూ తెలంగాణలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఆ క్రమంలో అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేశాయి. పలువురి అభిప్రాయాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. అనంతరం ఈ వ్యవహారంపై కేంద్ర జలశక్తితోపాటు పలు శాఖల మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి సోదాహరణగా వివరించారు.
Also Read : Pashamylaram: పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో భారీ ప్రమాదం ! 12 మంది మృతి !
