Rajeev Chandrasekhar : కంపెనీలు పబ్లిషర్స్ కు వాటా ఇవ్వాలి
కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్
Rajeev Chandrasekhar : కేంద్ర ఎలక్ట్రానిక్స్ , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్(Rajeev Chandrasekhar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డీన్ పీఏ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా కంటెంట్ క్రియేషన్ అనేది కీలకంగా మారిందన్నారు. ఇప్పటికే ఆయా వార్తలు, విశేషాలు, కథనాలు , పరిశోధనలకు సంబంధించి టెక్ కంపెనీలు విరివిగా వాడుకుంటున్నాయి.
దీనిపై ఆస్ట్రేలియాలో న్యూస్ పబ్లిషర్స్ కోర్టుకు ఎక్కారు. ప్రభుత్వానికి నివేదించారు. గూగుల్ తమ వార్తలను వాడుకుంటోందంటూ ఆరోపించారు. అదో పెద్ద వివాదానికి దారి తీసింది. ఈ తరుణంలో కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. తమ శోధన ఫలితాలు, ఫీడ్ లలోకి వార్తలను పంపడం ద్వారా లాభాన్ని పొందే భారీ టెక్ కంపెనీలు పబ్లిషర్లకు తప్పనిసరిగా రాబడిలో సరసమైన వాటా ఇవ్వాలని పేర్కొన్నారు.
రెండింటి మధ్‌య సంబంధంలో అసమతుల్యత ను పరిష్కరించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ఇదే సమయంలో సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. జర్నలిజం భవిష్యత్తు, డిజిటల్ , ప్రచురణ వార్తల పరిశ్రమ ఆర్థికంగా బలపడేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్ (డీఎన్పీఏ) నిర్వహించిన కాన్ క్లేవ్ లో పాల్గొన్నారు. ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్ , యురోపియన్ యూనియన్ దేశాలు తీసుకున్న నిర్ణయాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఇది చిన్న సంస్థలను తీవ్రంగా నష్ట పరిచిందన్నారు. రాబోయే డిజిటల్ ఇండియా చట్టం ఆస్ట్రేలియా మాదిరిగానే పరిష్కారాన్ని అనుసరించి సమస్యను పరిష్కరించ గలదని ఆశాభావం వ్యక్తం చేశారు రాజీవ్ చంద్రశేఖర్(Rajeev Chandrasekhar) .
Also Read : ట్విట్టర్ లో కీలక అప్ డేట్ – ఎలోన్ మస్క్