రాజముద్రతో రైతులకు సంపూర్ణ హక్కులు : స‌విత

స్ప‌ష్టం చేసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి

క‌డ‌ప జిల్లా : మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిని ఏకి పారేశారు ఏపీ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత‌. వైసీపీ హ‌యాంలో వ్య‌వ‌సాయ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశార‌ని ఆరోపించారు. తాము వ‌చ్చాక రైతుల‌ను అన్ని విధాలుగా ఆదుకుంటున్నామ‌ని చెప్పారు. రైతుల పట్టాదారు పాస్ బుక్ లపైనా, సర్వే రాళ్లపైనా జగన్ తన బొమ్మను ముద్రించుకుని రైతులను, భూ యజమానులు భయ బ్రాంతులకు గురిచేశారని మంత్రి సవిత మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం రాగానే జగన్ తీసుకొచ్చిన చీకటి చట్టం ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశామన్నారు. పట్టాదారు పాస్ బుక్ లపై జగన్ బొమ్మను తొలగించి, రాజముద్ర వేసి రైతుల భూ హక్కులకు రక్షణ కల్పించామన్నారు. రైతులకు తమ భూములపై సంపూర్ణ హక్కులు కల్పించామన్నారు.

అయిదేళ్లలో జగన్ అయిదు పర్యాయాలు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై ఆర్థిక భారం మోపారన్నారు. కూటమి ప్రభుత్వం ప్రతి యూనిట్ పై 13 పైసల చొప్పున్న ట్రూ అప్ ఛార్జీలు తగ్గించిందన్నారు. దీని కార‌ణంగా రాష్ట్ర స‌ర్కార్ ఖ‌జానాపై ఏకంగా రూ. 4 వేల కోట్ల‌కు పైగా భారం ప‌డుతుంద‌ని, అయినా భ‌రించేందుకు సిద్దంగా ఉన్నామ‌న్నారు. తాము ప్ర‌జా పాల‌న సాగిస్తున్నామ‌ని చెప్పారు ఎస్. స‌విత‌.
ఇదిలా ఉండ‌గా మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా రైతులు పంటలు వేసి లాభాలు ఆర్జించాలని క‌డ‌ప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ సూచించారు. ఉల్లి రైతులు నష్టపోవడానికి ప్రధాన కారణం ధర లేకపోవడం, స్థానిక మార్కెట్ కు అవసరం లేని రెడ్ ఉల్లిని ఉత్పత్తి చేయడంతో పాటు ప్రకృతి వైపరీత్యాలు కూడా మరో కారణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హార్టీ కల్చర్ ను ప్రోత్సాహిస్తోందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Leave A Reply

Your Email Id will not be published!