Congress Charge Sheet : బీజేపీపై కాంగ్రెస్ ఛార్జిషీట్
ముగింపు దశకు రాహుల్ యాత్ర
Congress Charge Sheet : రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగింపు దశకు చేరుకుంది. జనవరి 31న బహిరంగ సభ చేపట్టనుంది కాంగ్రెస్ పార్టీ. శనివారం పాదయాత్ర జమ్మూ కాశ్మీర్ లో కొనసాగుతోంది. ఈ తరుణంలో ఢిల్లీలో ఆ పార్టీ జనవరి 26 నుంచి హాత్ కే సాత్ జోడో లోగోను ఆవిష్కరించుకుంది.
ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీపై ఛార్జిషట్(Congress Charge Sheet) ను విడుదల చేసింది. ఇదిలా ఉండగా రాహుల్ గాంధీ గత ఏడాది 2022 సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ఈ యాత్ర తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ , రాజస్థాన్ , హర్యానా, పంజాబ్ లో పూర్తయింది.
జమ్మూ కాశ్మీర్ లో ప్రస్తుతం పాదయాత్ర కొనసాగుతోంది. చివరి దశలో కతువాలో రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగుతోంది. నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇందులో భాగంగానే ఛార్జిషీట్ ను రిలీజ్ చేసింది. తొమ్మిది సంవత్సరాల కాలంలో దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరిగిందని పేర్కొంది.
137 కోట్ల ప్రజలలో 200 మంది వ్యాపారవేత్తలు లాభ పడ్డారని ఆరోపించింది కాంగ్రెస్ పార్టీ. దేశంలో విద్వేష రాజకీయాలను బీజేపీ ఎగదోస్తోందని మండిపడింది. 2014 నుండి సంపద 50 రెట్లు పెరిగిన ఒక వ్యాపారవేత్త ప్రైవేట్ జెట్ లో ప్రయాణం చేసేందుకు మోడీ ఢిల్లీకి వెళ్లారని ఆరోపించింది.
దేశంలోని అత్యంత సంపన్నులలో 10 శాతం మంది భారత దేశ సంపదలో 64 శాతం మంది కలిగి ఉన్నారని పేర్కొంది. రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేయలేదని , మోదీ స్నేహితులకు చెందిన 72,000 వేల కోట్ల విలువైన రుణాలను మాఫీ చేశారని వాపోయింది.
Also Read : హాత్ సే హాత్ జోడో లోగో విడుదల