Congress Complaint : కేటీఆర్ పై ఈసీకి ఫిర్యాదు

దివ‌స్ తో ఎన్నిక‌ల కోడ్ ఉల్లంఘ‌న

Congress : హైద‌రాబాద్ – కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల వేళ సీరియ‌స్ అయ్యింది. బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ , ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ పై ఫిర్యాదు చేసింది. ఎన్నిక‌ల కోడ్ ను ఉల్లంఘించారంటూ ఆరోపించారు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్.

Congress Complaint Viral

దీక్షా దివ‌స్ పేరుతో తెలంగాణ భ‌వ‌న్ లో బీఆర్ఎస్ పార్టీ కార్య‌క‌ర్త‌లు ర‌క్త‌దానం నిర్వ‌హించారు. ఇది పూర్తిగా పార్టీ ఆఫీసు లోనే ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించార‌ని , ఇది ఎన్నిక‌ల కోడ్ లోకి వ‌స్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. బుధ‌వారం కాంగ్రెస్(Congress) పార్టీ ఆధ్వ‌ర్యంలో రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం కు వెళ్లారు. సిఇవో వికాస్ రాజ్ కు ఫిర్యాదు చేశారు.

కాగా ఎన్నిక‌ల‌కు ఒక్క రోజు ముందు కేటీఆర్ పై ఫిర్యాదు చేయ‌డం చ‌ర్చకు దారి తీసింది. ఇదే స‌మ‌యంలో ఎన్నిక‌లలో భాగంగా బీఆర్ఎస్ స‌ర్కార్ తీసుకున్న రైతు బంధు ప‌థ‌కం కింద నిధులు జ‌మ చేస్తాన‌ని ప్ర‌క‌టించడాన్ని త‌ప్పు ప‌ట్టింది.

ఇదే విష‌యాన్ని కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఆధారాల‌తో స‌హా ఫిర్యాదు చేసింది. దీంతో ఉన్న‌ట్టుండి కేసీఆర్ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లింది. ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో ఆరోగ్య‌, ఆర్థిక శాఖ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు డ‌బ్బులు చేస్తామంటూ ప్ర‌క‌టించారు. టింగ్ టింగ్ మంటూ మోగుతుందంటూ పేర్కొన్నారు. ఈ వీడియోను, ప‌త్రిక‌ల్లో వ‌చ్చిన వార్త‌ల‌ను జ‌త ప‌ర్చారు.

Also Read : Nara Lokesh : జ‌గ‌న్ రాక్షస పాల‌న జ‌నం ఆవేద‌న

Leave A Reply

Your Email Id will not be published!