Randeep Surzewala : అమిత్ షాపై కాంగ్రెస్ ఫిర్యాదు

విద్వేషాలు రెచ్చ గొడుతున్నార‌ని ఆరోప‌ణ

Randeep Surzewala : క‌ర్ణాట‌క‌లో రాజ‌కీయం ర‌స‌కందాయ‌కంగా మారింది. అధికారంలో ఉన్న బీజేపీపై ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ పార్టీ నిప్పులు చెరుగుతోంది. ఒక‌రిపై మ‌రొక‌రు ఆరోప‌ణ‌లు చేసుకుంటున్నారు. మ‌రింత ర‌క్తి క‌ట్టిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఆ పార్టీ క‌ర్ణాట‌క రాష్ట్ర ఇంఛార్జ్ ర‌ణ్ దీప్ సూర్జే వాలా కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాపై నిప్పులు చెరిగారు.

ప్ర‌శాంతంగా ఉన్న క‌ర్ణాట‌క‌లో ప్ర‌జ‌ల మ‌ధ్య మ‌తం పేరుతో, కులం పేరుతో విద్వేషాలు సృష్టించేలా ప్ర‌య‌త్నం చేస్తున్నారని , ఇందుకు ఇటీవ‌ల అమిత్ షా చేసిన కామెంట్సే నిద‌ర్శ‌న‌మ‌ని స్ప‌ష్టం చేశారు ర‌న్ దీప్ సూర్జేవాలా(Randeep Surzewala). కులాలు, మ‌తాల మ‌ధ్య ద్వేషాలు ర‌గిల్చి ఓట్లు పొందాల‌ని అనుకుంటున్నార‌ని అందులో భాగంగానే ఇలాంటి రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేస్తున్నారంటూ ఆరోపించారు.

క‌ర్ణాట‌క రాష్ట్రంలో సామర‌స్యానికి విఘాతం క‌లిగించ‌డం, అవినీతికి పాల్ప‌డ‌డం , తెలిసి త‌ప్పుడు ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డం , దురుద్దేశ పూర్వ‌కంగా వ్య‌వ‌హ‌రించేలా ప్ర‌య‌త్నిస్తున్నందుకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై(Amit Shah) ఎఫ్ఐఆర్ న‌మోదు చేయాల‌ని డిమాండ్ చేశారు ర‌ణ్ దీప్ సూర్జేవాలా. రాష్ట్రాన్ని అవినీతిమ‌యం చేసిన ఘ‌న‌త కేంద్రానికే ద‌క్కుతుంద‌న్నారు. దౌర్జ‌న్య పూరితంగా వ్య‌వ‌హ‌రించాల‌ని చూస్తే ప్ర‌జ‌లు ఊరుకోర‌న్నారు సూర్జేవాలా.

Also Read : స్వ‌లింగ వివాహంపై రిజిజు కామెంట్స్

Leave A Reply

Your Email Id will not be published!