Congress Fourth List : అద్దంకికి షాక్ శామ్యూల్ కు ఛాన్స్
కాంగ్రెస్ నాలుగో జాబితా విడుదల
Congress Fourth List : హైదరాబాద్ – తెలంగాణ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ ఎట్టకేలకు కసరత్తు చేసింది. ఈ మేరకు ఇప్పటి వరకు 119 సీట్లకు గాను మూడు లిస్టులు ప్రకటించింది. తాజాగా నాలుగో జాబితాను ఖరారు చేసింది. ఇప్పటి వరకు కాంగ్రెస్(Congress) పార్టీ తరపున ప్రజల గొంతుకను గత కొన్నేళ్లుగా వినిపిస్తూ వచ్చారు అద్దంకి దయాకర్. ఆయనకు టికెట్ రాకుండా చేసేందుకు కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రయత్నం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.
Congress Fourth List Released
అద్దంకి దయాకర్ రేవంత్ రెడ్డి మనిషిగా గుర్తింపు పొందాడు. తాజాగా రిలీజ్ చేసిన లిస్టులో తుంగతుర్తి టికెట్ ను మందుల శ్యామల్ కు కేటాయించింది హైకమాండ్. పటాన్ చెరులో కోలుకోలేని షాక్ ఇచ్చింది పార్టీ. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నీలం మధుకు ముందుగా కేటాయించింది. చివరకు గాంధీ భవన్ కు వెళ్లిన తనకు బీ ఫామ్ టికెట్ ఇవ్వకుండా వెనక్కి పంపించింది.
ఇక్కడ కాట శ్రీనివాస్ గౌడ్ కు ఉన్నట్టుండి రాత్రి ప్రకటించిన జాబితాలో సీటు కేటాయించింది. ఆయన మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజ నరసింహకు అనుంగు అనుచరుడిగా గుర్తింపు పొందారు. చివరకు జగ్గారెడ్డి, రేవంత్ రెడ్డి నీలం మధు వైపు నిలువగా శ్రీనివాస్ గౌడ్ వైపు రాజ నరసింహ నిలిచారు. తన పంతం నెగ్గించుకున్నారు. సూర్యాపేటలో రమేష్ రెడ్డికి షాక్ ఇచ్చింది. సూర్యాపేటలో దామోదర్ రెడ్డి, మిర్యాల గూడలో బత్తుల లక్ష్మా రెడ్డికి కేటాయించింది.
Also Read : Rachin Ravindra : సచిన్ రికార్డ్ రచిన్ బ్రేక్