Congress: కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్‌ ! పన్ను మినహాయింపునకు ట్రిబ్యునల్ నిరాకరణ !

కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్‌ ! పన్ను మినహాయింపునకు ట్రిబ్యునల్ నిరాకరణ !

Congress : కాంగ్రెస్ పార్టీకి ఆదాయం పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్ (ITAT)లో చుక్కెదురైంది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి రూ.199.15 కోట్ల విరాళాలపై పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన అప్పీల్‌ను ఐటీఏటీ తోసిపుచ్చింది. ఆదాయపు పన్ను చట్టం కింద పన్ను మినహాయింపు క్లెయిమ్‌ కోసం పార్టీ ఆలస్యంగా రిటర్నులు దాఖలు చేసిందని, కీలకమైన లీగల్ షరతులను పాటించడంలో విఫలమైందని ఐటీఏటీ పేర్కొంది. పన్ను మినహాయింపు ఇవ్వడం అంటే ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ చట్టంలోని సెక్షన్‌ 13ఏను ఉల్లంఘించినట్లే అవుతుందని స్పష్టం చేసింది. చట్ట ప్రకారం మొత్తం ఆదాయానికి పన్ను చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.

ITAT Shocking to Congress Party

ఈ మేరకు అందుకు గల కారణాల్ని ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ట్రిబ్యూనల్‌ ప్రస్తావించింది. కాంగ్రెస్ పార్టీ (Congress) తన ఆదాయపు పన్ను రిటర్న్‌ను 2019 ఫిబ్రవరి 2న ఫైలింగ్ చేసింది. ఇది 2018 డిసెంబర్ 31 చివరి తేదీ లోపు చేయాల్సి ఉంటుంది. సెక్షన్ 139(1) ప్రకారం డ్యూ డేట్‌ కింద రాకపోవడం వల్ల, సెక్షన్ 13A ప్రకారం మినహాయింపు పొందలేకపోయింది. దీనికి తోడు పార్టీ ఇన్‌ కమ్‌ ట్యాక్స్‌ నియమాలకు విరుద్ధంగా నగదు విరాళాలు సేకరించింది. పార్టీ సేకరించిన రూ.14.49 లక్షల నగదులో విరాళాలు అందించిన దాత రూ.2వేల కంటే ఎక్కువ మొత్తంలో సమర్పించారు. తద్వారా సెక్షన్ 13A(డీ) నిబంధనలను ఉల్లంఘించింది. ఆలస్యంగా పన్ను రిటర్న్ దాఖలు చేయడం వల్ల రాజకీయ పార్టీలకు పన్ను మినహాయింపు ఇచ్చే సెక్షన్ 13ఏకు అర్హత కోల్పోయిందని ద్విస్వభ ఐటీఏటీ బెంచ్ తమ ఆదేశాల్లో పేర్కొంది. దీంతో మొత్తం రూ.199 కోట్ల విరాళాలకు కాంగ్రెస్ పార్టీ ఆదాయం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

రాజకీయ పార్టీలు మినహాయింపులు పొందాలంటే కఠినమైన నిబంధనలు పాటించాలి. చారిటబుల్ ట్రస్టులుకి ఉన్న వెసులుబాటు రాజకీయ పార్టీలకు వర్తించదు. దీనితో తాజా ట్యాక్స్‌ ట్రిబ్యూనల్‌ నిర్ణయం కాంగ్రెస్‌కు ఎదుదెబ్బ తగిలినట్లైంది.

Also Read : Air India: ఎయిరిండియా విమానంలో మంటలు

Leave A Reply

Your Email Id will not be published!