Congress Launches : హాత్ సే హాత్ జోడో లోగో విడుదల
26 నుంచి కాంగ్రెస్ పార్టీ శ్రీకారం
Congress Launches : కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా జనవరి 26 నుంచి ఇంటింటికీ ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే కాంగ్రెస్ యువ నాయకుడు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో భారత్ జోడో యాత్రను చేపట్టారు. జనవరి 31న పాదయాత్ర పూర్తవుతుంది. జమ్మూలో బహిరంగ సభతో ముగుస్తుంది.
కాగా జోడో యాత్ర సైద్ధాంతిక ఉద్యమమని పేర్కొంది కాంగ్రెస్ పార్టీ. తాజాగా హాత్ సే హాత్ జోడో ప్రచారాన్ని చేపట్టేందుకు ప్లాన్ చేసింది. కేంద్రంలో నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, వైఫల్యాలను ఎత్తి చూపేందుకు గాను ప్రతి భారతీయుడికి తెలియ చేసేందదుకు ఇంటింటికీ ఎన్నికల ప్రచారానికి సంబంధించి హాత్ సే హాత్ జోడో లోగోను(Congress Launches) శనివారం విడుదల చేసింది.
ఈ హాత్ సే హాత్ జోడో కార్యక్రమం ప్రారంభం అవుతుందని స్పష్టం చేసింది. అంతే కాకుండా భారతీయ జనతా పార్టీపై ఇంటింటికీ పంపిణీ కోసం ఎనిమిది పేజీల చార్జ్ షీట్ ను విడుదల చేసింది. లోగోను విడుదల చేస్తూ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ మాట్లాడారు. ఈ యాత్ర మోదీ వైఫల్యాలను, చేస్తున్న మోసాన్ని తెలియ చేస్తుందన్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా హాత్ సే హాత్ జోడో ప్రచారాన్ని ప్రారంభిస్తారని జై రాం రమేష్ చెప్పారు. ఇది మొదటి దశలో గ్రామాలు, మండలాలలో , రెండో దశలో జిల్లా స్థాయిలో మూడో దశలో రాష్ట్ర స్థాయిలో నిర్వహించడం జరుగుతుందన్నారు.
Also Read : పీఎంపై ఎంపీ ట్వీట్ తొలగించిన ట్విట్టర్