Congress : తెలంగాణకు భారీ విరాళం ప్రకటించిన కాంగ్రెస్ ప్రజాప్రతినిదులు

భారీ వర్షాలతో అతలాకుతలమైన ఖమ్మంను ఆదుకోవడానికి కాంగ్రెస్ కొండంత సాయం చేసింది...

Congress : ఎగిరిపోయిన పైకప్పులు, కూలిన గోడలు, కొట్టుకుపోయిన ఇళ్లు..! ఖమ్మంలో మున్నేరు విలయంతో ఎటుచూసినా విషాద గాథలే..! ఏ వీధిలో తిరగాలన్నా అంతా బురదే..! ఏ ఇంట్లో చూసినా మట్టికొట్టుకున్న వస్తువులు, దుస్తులే..! కొందరికి ఇవీ లేవు. ఆయా ప్రాంతాల్లో ఏ ఇల్లాలిని కదిలించినా కన్నీరే. మున్నేరు ఉగ్రరూపం దాల్చి 36 అడుగుల మేర ప్రవహించడంతో నది తీరాన ఉన్న ప్రాంతాల్లో వేల ఆవాసాలు నీట మునిగాయి. ఇలా ఒకటా రెండా ఎటు చూసినా హృదయాలను కదిలించే దృశ్యాలే!. ఇప్పుడిప్పుడే అటు మున్నేరు కాస్త శాంతించగా.. ఇటు ఖమ్మం నగర వాసులు కాస్త ఊపిరిపీల్చుకుంటున్నారు. అయితే.. వరద బాధితులను ఆదుకునేందుకు ఎంతోమంది సినీ, రాజకీయ ప్రముఖులు ముందుకొచ్చారు. సామాన్య ప్రజలు మొదలుకుని సెలబ్రిటీలు, పలు రంగాల పెద్దలు ముందుకొచ్చి తమకు తోచినంత విరాళంగా ప్రకటించారు. వారు ప్రకటించిన సొమ్ము అంతా చెక్కులు, నేరుగా నగదు, ఆన్‌లైన్ రూపంలో ఇప్పటికే సీఎం సీఎం సహాయ నిధికి అందజేశారు. ఇక ‘మేము సైతం’ అంటూ తెలంగాణాలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ(Congress) ముందుకొచ్చి కొండంత సాయం చేసింది.

Congress Leaders

భారీ వర్షాలతో అతలాకుతలమైన ఖమ్మంను ఆదుకోవడానికి కాంగ్రెస్(Congress)కొండంత సాయం చేసింది. వరద బాధితుల విషయంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. వరద బాధితుల కోసం రెండు నెలల జీతాన్ని ఇవ్వాలని ప్రజాప్రతినిధులు నిర్ణయించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు తమ రెండు నెలల జీతాన్ని సీఎం సహాయనిధికి ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పలు కార్పోరేషన్ల చైర్మన్లు కూడా ఉన్నారు. వీరంతా తమ రెండు నెలల జీతాన్ని సీఎం సహాయ నిధికి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. వీరితో పాటు ప్రభుత్వ సలహాదారులు సైతం తమ రెండు నెలలు జీతం ముఖ్యమంత్రి సహాయనిధికి ఇవ్వాలని నిర్ణయించారు. కాంగ్రెస్ నేతలంతా.. సీఎం రేవంత్ రెడ్డి, కొత్త పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

కాంగ్రెస్(Congress) ప్రజాప్రతినిధుల నిర్ణయం పట్ల సామాన్య ప్రజలు, వరద బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక వరద బాధిత ప్రాంతాల్లో పరిస్థితులపై ఎప్పటికప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సమీక్షలు నిర్వహిస్తూనే ఉన్నారు. మరోవైపు.. సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక సమీక్షలు, సమావేశాలు రద్దు చేసుకుని మరీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు వరద ప్రభావిత ప్రాంతాల్లోనే ఉంటున్నారు. ఇప్పటికే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఖమ్మంలో పర్యటించగా.. ఆదివారం నాడు మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా పర్యటించారు. వరద బాధితులను కేంద్రం తప్పకుండా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక వచ్చిన వెంటనే పూర్తి నిధులు వస్తాయన్నారు. వరద సాయం విషయంలో కేంద్రానికి వివక్ష లేదని.. స్టేట్ డిజాస్టర్‌ నిధులతో వరద బాధితులను ఆదుకోవాలన్నారు. మరోసారి తుఫాన్‌ ముప్పు పొంచి ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని కిషన్‌ రెడ్డి సూచించారు.

Also Read : Minister Kishan Reddy : వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కిషన్ రెడ్డి

Leave A Reply

Your Email Id will not be published!